ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు ఉన్నా.. ఉపాధ్యాయుల్లేరు

ABN, Publish Date - Jun 26 , 2025 | 12:02 AM

మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగా ఉన్నా రెగ్యులర్‌ ఉపాధ్యాయులు మాత్రం లేరు.

ఉపాధ్యాయులు లేని పెద్దకేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పోస్టులు ఖాళీ

- బదిలీల్లో వాటిని చూపించని వైనం

- క్లస్టర్‌ టీచర్లు, సీఆర్‌టీలతో విద్యార్థులకు బోధన

- మెళియాపుట్టి మండలం పెద్దకేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుమారు 27 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో ఈ పాఠశాల పేరును విద్యాశాఖ అధికారులు చూపించలేదు. దీంతో ఎవరూ ఇక్కడకు రాలేదు. అయితే సాధారణ బదిలీపై సీతంపేట మండలం నుంచి ఒక ఉపాధ్యాయురాలు ఈ పాఠశాలకు వచ్చారు. ఇక్కడ చేరిన ఒక్కరోజుకే మళ్లీ పాత పాఠశాలకే ఆమె వెళ్లిపోయారు. అక్కడ రిలీవర్‌ రావపోవడంతో తిరిగి ఆమె వెళ్లిపోయినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీఆర్‌టీతో విద్యార్థులకు బోధన అందిస్తున్నారు.

- మెళియాపుట్టి మండలం అంపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుమారు 22 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో ఇక్కడ పోస్టును ఖాళీ చూపించకపోవడంతో ఎవరూ రాలేదు. దీంతో ప్రస్తుతం క్లస్టర్‌ ఉపాధ్యాయుడితో బోధన సాగిస్తున్నారు.

- మెళియాపుట్టి మండలం ముఖందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 మంది పిల్లలు ఉన్నా రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, నందవ పాఠశాలలో 33 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు అవసరం. కానీ, గత ఐదేళ్ల నుంచి ఒక్క టీచర్‌తోనే పాఠశాలను నడిపిస్తున్నారు. ఇక్కడ కూడా ఖాళీ చూపించకపోవడంతో బదిలీపై ఎవరూ రాలేదు. అదే విధంగా డబార్‌ ప్రాఽథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు ఉన్నా వారికి బోధించే ఉపాధ్యాయులు లేరు.

మెళియాపుట్టి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగా ఉన్నా రెగ్యులర్‌ ఉపాధ్యాయులు మాత్రం లేరు. దీంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. క్లస్టర్‌ ఉపాధ్యాయులు, సీఆర్‌టీలతో ఈ పాఠశాలలను నెట్టుకొస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో 5, సీతంపేట మండలంలో 19, పాతపట్నంలో 1, సోంపేటలో 1 జలుమూరులో 2, శ్రీకాకుళం మండలంలో 2 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పని చేస్తున్న వారు ఆ స్కూళ్లలోనే పనిచేయాలనే నిబంధన ఉంది. మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అక్కడకు వెళ్లే అవకాశం ఉండదు. అయితే, గతంలో ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో పనిచేసిన చాలామంది ఎస్జీటీలకు ప్రమోషన్లు రావడంతో వారు ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలలకు వెళ్లిపోయారు. అలాగే, చాలామంది పదవీ విరమణ చేశారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టులు గత కొన్నేళ్లుగా భర్తీ కావడం లేదు. ఇటీవల ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టినప్పటికీ ఈ పాఠశాలల్లో ఖాళీలు చూపించలేదు. దీనివల్ల ఆ పోస్టులు భర్తీ కాలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డీఎస్సీ ద్వారా ఇక్కడ పోస్టులను భర్తీ చేస్తారని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. అంత వరకు క్లస్టర్‌, సీఆర్‌పీలతో బోధన సాగించక తప్పదని అంటున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. మెళియాపుట్టి మండలంలోని మూడు పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ప్రస్తుతం క్లస్టర్‌ టీచర్లు, సీఆర్‌టీలతో బోధన కొనసాగిస్తున్నారు. త్వరలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంది.

-సవర దేవేంద్రరావు, మండల విద్యాశాఖ అధికారి, మెళియాపుట్టి

Updated Date - Jun 26 , 2025 | 12:02 AM