మరుగుదొడ్లు లేవు.. తాగు నీరులేదు
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:43 PM
పూండి వారపుసంతలో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా మరుగుదొడ్లు, తాగు నీరు వంటి సదుపాయాలను కల్పిం చలేదు. ప్రతి గురువారం ఇక్కడ నిర్వహించే వారపు సంతలో ఆశీల రూపం లో లక్షలాది రూపాయలు వసులుచేస్తున్నారు.
వజ్రపుకొత్తూరు,జూలై7(ఆంధ్రజ్యోతి):పూండి వారపుసంతలో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా మరుగుదొడ్లు, తాగు నీరు వంటి సదుపాయాలను కల్పిం చలేదు. ప్రతి గురువారం ఇక్కడ నిర్వహించే వారపు సంతలో ఆశీల రూపం లో లక్షలాది రూపాయలు వసులుచేస్తున్నారు.అయినా పంచాయతీ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించడంలేదన్న విమర్శలొస్తున్నాయి. ఇక్కడ బ్రిటీష్ పాలనాకాలం నుంచి ప్రతి గురువారం సంత నిర్వహిస్తున్నారు. సంతకు వజ్రపుకొత్తూరు, నందిగాం, సంతబొమ్మా ళితోపాటు పలు మండలాల నుంచి వందలాది మంది వచ్చి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. క్రయ విక్రయదారులకోసం ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో అవస్థల మధ్యే కార్యకలాపాలు చేపడుతున్నారు. మరుదుదొడ్లు లేకపోవడంతో సంతకు వచ్చే మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ద్విచక్రవాహనాలు రోడ్డుపైనే నిలపాల్సివస్తోంది. పంచాయతీ అధికారులు స్పందించి సంతలో వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jul 07 , 2025 | 11:43 PM