ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాళాలు వేసిన ఇళ్లే వారి టార్గెట్‌

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:17 AM

తాళాలు వేసిన ఇళ్ల పై రెక్కి నిర్వహిం చి అర్ధరాత్రి దాటిన తరువాత ఆ ఇం టిలోకి ప్రవేశించి దొంగతనాలకు అలవాటు పడిన ఒడిశాకు చెందిన ముగ్గురు అంత రాష్ట్ర దొంగలను కాశీబుగ్గ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకట అప్పారావు
  • ముగ్గురు ఒడిశా దొంగల అరెస్టు

  • బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.50వేలు స్వాధీనం

  • వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకట అప్పారావు

పలాస, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): తాళాలు వేసిన ఇళ్ల పై రెక్కి నిర్వహిం చి అర్ధరాత్రి దాటిన తరువాత ఆ ఇం టిలోకి ప్రవేశించి దొంగతనాలకు అలవాటు పడిన ఒడిశాకు చెందిన ముగ్గురు అంత రాష్ట్ర దొంగలను కాశీబుగ్గ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50 వేలు నగదు, 58 గ్రాముల బంగారు, 450 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు, దొంగతనానికి వినియోగించే పరికరాలను స్వా ధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు ఆదివా రం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతోష్‌ సాహు, రాజ్‌కుమార్‌ సేథి, బబుల్లా సేథి ముగ్గురు కలసి వివిధ దొంగత నాలకు పాల్పడ్డారు. వీరిపై ఒడిశా రాష్ట్రంలో దొంగతనాలు చేసి పట్టుబడడంతో జైలు జీవితాన్ని అనుభవించారు. సంతోష్‌ సాహుకు చిత్రాపూర్‌ జైలులో ఉండగా రాజ్‌కుమార్‌ సేథి పరిచయం అయ్యాడు. రాజ్‌కుమార్‌, బబుల్లాసేథిలు చిలక స రస్సు వద్ద ఓ హోటల్‌లో పరిచయం అయ్యారు. వీరి సంపాదన ఎందుకూ సరి పోకపోవడంతో దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడ్డా రు. ద్విచక్ర వాహనాలు, చైన్‌ స్నాచింగ్‌లు, ఇంటిలో చొరబడి దొంగతనాలు చేయ డానికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు ఒడిశా పోలీసులకు పట్టు బడడంతో అక్కడ జైలుశిక్ష అనుభించారు. అక్కడ నుంచి విడుదలైన తరువాత ఆంధ్రాలో దొంగతనాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో అల్లు కృష్ణవేణి అనే మహిళ ఇంటిని ఎంచుకు న్నారు. గత నెల 17వ తేదీ రాత్రి ఆమె తన కుమార్తె ఇంటికి వెళ్లి నిద్రించింది. ఆ ఇంటిలో ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తించి పై ముగ్గురూ ఆ ఇంటి తలుపు లు బద్దలు కొట్టి బీరువాలో ఉన్న వెండి వస్తువులు దొంగిలించారు. దీనిపై కాశీ బుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కేసు నమోదు చేసి దొంగల కోసం ప్రత్యేక బృం దాలను నియమించారు. ఈ క్రమంలో ఆదివారం కోసంగిపురం జాతీయ రహదా రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముగ్గురు దొంగలు రెండు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయట పెట్టా రు. లక్ష్మీపురం కేసుతో పాటు పలాస మండలం పెద్దనారాయణపురం గ్రామం వద్ద రెండు దొంగతనాలు, రెండు చైన్‌ స్నాచింగ్‌ కేసులు, పలాస వివేకానంద కాలనీలో రోబరీలో వీరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో వీరు చేసిన నేరాలు రుజువైనట్టు డీఎస్పీ తెలిపారు.

సమాచారం ఇవ్వండి

వేరే గ్రామాలకు వెళ్లినప్పుడు తమకు సమాచారం ఇస్తే పోలీసు పహరా ఏర్పాటు చేస్తామ డీఎస్పీ వెంకటఅప్పారావు తెలిపారు. విలువైన వస్తువులు భద్ర పరచాలని, లేకుంటే ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకొని రక్షణ కల్పిం చాలని కోరారు. దొంగతనాలు జరగకుండా రాత్రులు గస్తీ పెట్టామని, ప్రజలు కూడా తమవంతు సహాయంగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఒడిశా దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ నర్సింహమూర్తి, పోలీసులు శ్రీనివాసరావు, గవరయ్య, నీలకంఠం, ఉషాకిరణ్‌ను ఆయన అభినందించారు.

Updated Date - Aug 04 , 2025 | 12:17 AM