రెండిళ్లలో చోరీ
ABN, Publish Date - May 23 , 2025 | 11:57 PM
పలాస మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అంధవరపు బాలకృష్ణ, అంధవరపు సులోచనలకు చెందిన ఇళ్లలో బుధవారం చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యా దు చేశారు.
పలాస, మే 23(ఆంధ్రజ్యోతి): పలాస మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అంధవరపు బాలకృష్ణ, అంధవరపు సులోచనలకు చెందిన ఇళ్లలో బుధవారం చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. బాలకృష్ణ విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. ఈనెల 21న అరతులం బంగారు ఆభరణాలు బీరువాలో పెట్టి విశాఖ వెళ్లారు. ఇంటిలో చోరీ జరిగినట్లు ఆయన సోదరుడు ఫోన్ చేయడంతో శుక్రవారం వచ్చి పరిశీలించి బంగారం పోయినట్లు గుర్తించారు. అదేవిధంగా ఉపాధి కూలీ గా పనిచేస్తున్న సులోచన ఇంటిలో లేని సమయంలో అప్పుగా తీసుకు వచ్చిన డబ్బులు, దాచుకున్న రూ.50వేలు నగదు బీరువాలో పెట్టగా గుర్తు తెలియని వ్యక్తులు బీరువా విరగ్గొట్టి డబ్బులు కాజేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ఘటనలు ఒకేరోజు జరగడంతో గ్రామంలో ఉన్న ఓ వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి చుట్టు పక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పెళ్లికి వెళుతున్న వాహనం బోల్తా
పోలాకి, మే 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని బెలమర పాలవలస కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం పోలాకి నుంచి పిన్నింటిపేటకు పెళ్లి వారితో వెళ్తున్న వాహనం అదుపు తప్పి సమీపంలోని వంశధార కాలు వలో బోల్తా పడింది. ఈ వాహనంలో 15 మంది వెళుతున్నారు. అయితే పలువురికి స్వల్ప గాయాలు తప్ప ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్థాని కులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని, సమాచారం మేరకు క్షేత్రస్థాయికి వెళ్లామని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారికి సపర్యలు చేశారు. ఇద్దరు వ్యక్తులకు గుండెపై బలమైన గాయాలైనట్టు చికిత్స పొందుతున్నట్టు బం ధువుల సమాచారం. ఎస్‌ఐ రంజిత్‌కుమార్ కేసు నమోదు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
రణస్థలం, మే 23(ఆంధ్రజ్యోతి): లోచర్లపాలెం గ్రామానికి చెందిన సింకు శ్యామలరావు (29) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్యామలరావు గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బం దులు పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంతనే చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శ్యామల రావు సోదరుడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.
Updated Date - May 23 , 2025 | 11:57 PM