ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీరభద్రాపురంలో నాలుగిళ్లలో చోరీ

ABN, Publish Date - May 06 , 2025 | 11:41 PM

పలాస మండలం వీరభద్రాపురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నాలు గు ఇళ్లలో ఇద్దరు దొంగ లు చోరీకి పాల్ప డ్డారు. నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు.

పలాస రూరల్‌: బీరువాను పరిశీలిస్తున్న క్లూస్‌ టీమ్‌

పలాసరూరల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): పలాస మండలం వీరభద్రాపురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నాలు గు ఇళ్లలో ఇద్దరు దొంగ లు చోరీకి పాల్ప డ్డారు. నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. వీరభద్రాపురం గ్రామంలో పైల కేశవరావు, తలగాపు మల్లేసు ఇళ్లలో చోరీకి పాల్పడగా ఆ ఇళ్లలో ఏమీ దొరక్కపోవడంతో కాయల ఢిల్లీశ్వరరావు ఇంటిలో దూరి పది తులాల వెండి ఆభరణాలు, మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశా రు. అనంతరం తలగాపు రామారావు భార్య ఇంటిలో నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడుతో పాటు బంగారు చెయిన్‌ను దొంగి లించి పరారీ అవుతున్న సమయంలో ఆమెకు మెలకువ వచ్చి కేకలు వేయ గా ఆమె కుమారుడు జోగారావు దొంగలను వెంబడించినప్పటికీ వారు పరారయ్యారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం క్లూస్‌ టీమ్‌, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సూర్య నారాయణ తెలిపారు.

బైక్‌ల దొంగ అరెస్ట్‌

సోంపేట, మే 6 (ఆంధ్రజ్యోతి): బైక్‌లు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు. మంగళ వారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఎస్‌ఐ లవరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన అమిత్‌కుమార్‌ పాత్రోను విచారించారు. సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు చెందిన ఏడు ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశాడు. సోంపేటలో రెండు హీరోహోండాలు, కంచిలి, ఇచ్ఛాపురంలలో రెండు పల్సర్‌ బైక్‌లతోపాటు బరంపురంలో రెండు ద్విచక్రవాహనాలను దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని సీఐ అభినందించారు.

Updated Date - May 06 , 2025 | 11:41 PM