‘యువత పోరు’ నిరసన హాస్యాస్పదం
ABN, Publish Date - Mar 11 , 2025 | 11:36 PM
:ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన సకా లంలో చెల్లించని జగన్ యువత పోరు పేరుతో నిరసనకు పిలుపున్విడం హాస్యా స్పదమని, వైసీపీ దొంగల ముఠా కలిసి పోస్టర్‌ను విడుదల చేయడం విడ్డూరంగా ఉందని తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు.
అరసవల్లి, మార్చి 11(ఆంధ్రజ్యోతి):ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన సకా లంలో చెల్లించని జగన్ యువత పోరు పేరుతో నిరసనకు పిలుపున్విడం హాస్యా స్పదమని, వైసీపీ దొంగల ముఠా కలిసి పోస్టర్‌ను విడుదల చేయడం విడ్డూరంగా ఉందని తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లలో గుర్తుకు రాని జగన్‌కు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా గుర్తుకురావడం వింతల్లో వింత అని అన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష, నియోజక వర్గ అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్, సెక్రటరీ గుర్రాల సుమంత్ చౌదరి, కంచి నీలం, బగ్గు రవి పాల్గొన్నారు.
Updated Date - Mar 11 , 2025 | 11:36 PM