ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పీఆర్‌ ఇంజనీర్ల ఖాళీలను భర్తీ చేయాలి

ABN, Publish Date - Apr 27 , 2025 | 11:40 PM

రాష్ట్ర వ్యాప్తంగా పంచా యతీరాజ్‌ ఇంజ నీరింగ్‌ విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చే యాలని రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేసింది.

మాట్లాడుతున్న అసోసియేషన్‌ ప్రతినిధులు

అరసవల్లి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పంచా యతీరాజ్‌ ఇంజ నీరింగ్‌ విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చే యాలని రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం స్థానిక జడ్పీ సమావేశ మంది రంలో జిల్లా అధ్యక్షుడు సనపల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వీవీ మురళీ కృష్ణంనాయుడు పాల్గొని మాట్లాడారు. 2014-19 మధ్య కాలంలో ఇంజనీర్లపై పెట్టిన కేసులు తొలగించాలని కోరారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కిలోమీటర్ల పొడవునా రోడ్లు వేసి దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. అలాగే ఇప్పటి ప్రభుత్వ హయాంలో పల్లె పండుగ పేరుతో పెద్ద ఎత్తున రహదారులు నిర్మాణాలు సకాంలో పూర్తి చేసిన ఘనత పీఆర్‌ ఇంజనీర్లదేనన్నారు. దాదాపు 30 ఏళ్లగా పోస్టులు భర్తీ చేయడం లేదని, చాలీచాలని సిబ్బందితోనే పనిచేస్తున్నామని, వెంటనే ఏపీపీఎస్సీ ద్వారా ఏఈల పోస్టు లు భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సంగీతరావు, ప్రతినిధి బి.శ్రీనివాస్‌తోపాటు 26 జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు.

Updated Date - Apr 27 , 2025 | 11:40 PM