ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్కింగ్‌ చేసిన వాహనాలే లక్ష్యం

ABN, Publish Date - Jun 07 , 2025 | 12:30 AM

జిల్లాలో పలు చోట్ల పార్కింగ్‌ చేసిన వాహనాలను ఎత్తుకువెళ్లిపోవడం.. తాళం వేసిన ఇళ్ల లో చోరీలకు పాల్పడడం వారు వృత్తిగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతూ చిక్కి కటకటాలపాల య్యారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు
  • ఆపై ఇళ్లల్లో చోరీలు

  • వేర్వేరు ఘటనల్లో పోలీసులను చూసి పరుగెత్తి పట్టుబడిన ఇద్దరు దొంగలు

  • 15 బైక్‌లు, రూ.5.5లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

  • వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు చోట్ల పార్కింగ్‌ చేసిన వాహనాలను ఎత్తుకువెళ్లిపోవడం.. తాళం వేసిన ఇళ్ల లో చోరీలకు పాల్పడడం వారు వృత్తిగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతూ చిక్కి కటకటాలపాల య్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసుకార్యాలయంలో శుక్రవారం ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన కొర్ల శివ అలియాస్‌ మున్నా, రణస్థలం మండలం పాతసుందరపాలెం గ్రామానికి చెందిన బస్వా సుధాకరరెడ్డి వేర్వేరుగా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పతున్నారు. శుక్రవారం మఽధ్యాహ్నం బుడితి జంక్షన్‌ సమీపంలోని ఓ రైస్‌ మిల్‌ వద్ద పోలీ సులను చూసి కొర్ల శివ పారిపోతున్నాడు. అతడిని వెంబడించి పోలీ సులు పట్టుకున్నారు. ఇటు శ్రీకాకుళం రూరల్‌ స్టేషన్‌ పరిధి పాత్రుని వలస ఫ్లైఓవర్‌ అండర్‌ పాసేజ్‌ కింద బస్వా సుధాకరరెడ్డి అక్కడే ఉన్న పోలీసులను చూసి పెరిగెత్తాడు. దీంతో అతడ్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఇద్దరిని పోలీసులు విచారించగా పలు విషయాలు వెలుగుచూశాయి. సారవకోట, జలుమూరు, ఎచ్చెర్ల, జే ఆర్‌ పురం, శ్రీకాకుళం, లావేరు, నరసన్నపేట, విజయ నగరం జిల్లా డెంకాడ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన బైక్‌లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలను దోచుకుపోయినట్టు విచారణలో తేలింది. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ.18లక్షలు విలువ గల 15 బైక్‌లు, రూ.5.5 లక్షలు విలువగల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ చూపిన ఏఎస్పీ శ్రీనివా సరావు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, సారవకోట ఎస్‌ఐ అనిల్‌, శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ సూర్య చంద్ర మౌళిను ఎస్పీ అభినందించారు.

Updated Date - Jun 07 , 2025 | 12:30 AM