చంద్రబాబును కలిసిన సిక్కోలు సైకిల్ యాత్రికులు
ABN, Publish Date - May 29 , 2025 | 12:04 AM
వైసీపీ ప్ర భుత్వ హయాంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర అవమానాలకు గురైన శ్రీకాకుళం జిల్లా నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఎన్.రామకృష్ణ, చిన్న రామసూరి, ఎన్.ఆదినారాయణ, బి.పెంటయ్య, ఎన్.సుందరరావు, ఎస్.రమేష్‌లు బుధవారం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్‌ను కలుసుకున్నారు.
రణస్థలం, మే 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్ర భుత్వ హయాంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర అవమానాలకు గురైన శ్రీకాకుళం జిల్లా నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఎన్.రామకృష్ణ, చిన్న రామసూరి, ఎన్.ఆదినారాయణ, బి.పెంటయ్య, ఎన్.సుందరరావు, ఎస్.రమేష్‌లు బుధవారం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్‌ను కలుసుకున్నారు. 2023 అక్టోబరులో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ వీరు కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేపట్టడానికి నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. పుంగనూరుకు చేరేసరికి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు సైకిల్ యాత్రను అడ్డుకున్నారు. సైకిల్‌పై ఉన్న జెండాలను తొలగించారు. వారి దుస్తులను సైతం తొలగించే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. కూటమి అధికారంలోకి రావడం.. మహానాడు జరుగుతుండడంతో పుంగనూరులో ఆగిన చోటు నుంచి వీరు మళ్లీ సైకిల్ యాత్రను ప్రారంభించారు. కడపలోని మహానాడు ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుతోపాటు మంత్రి లోకేష్‌ను కలిశారు. ఇరువురు నేతలూ వారిని అభినందించారు. వారి వెంట విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.
Updated Date - May 30 , 2025 | 02:55 PM