ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తీరప్రాంత రహదారితో మారనున్న జిల్లా రూపురేఖలు

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:58 PM

మూలపేట నుంచి విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు తీరప్రాంతం వెంబడి చేపట్టనున్న జాతీయ ర హదారి నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మారిపోతా యని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు.

దండుగోపాలపురంలో పర్యటిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, జూలై 12(ఆంధ్రజ్యోతి): మూలపేట నుంచి విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు తీరప్రాంతం వెంబడి చేపట్టనున్న జాతీయ ర హదారి నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మారిపోతా యని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం సాయంత్రం దండుగోపాల పురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూలపేట పోర్టు నిర్మా ణం 70శాతం మేర పూర్తయిందని, ఇది పూర్తయితే ఉద్యోగాలు రావని దానికి అనుసంధానంగా పరిశ్రమలు ఏర్పాటు అయినప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయ న్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు ఈ ప్రాంతంతో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థల ప్రతినిధులు ఈ ప్రాం తంలో స్థల పరిశీలన చేశాయన్నారు. ఈ నేపథ్యంలోనే మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు తీరం వెంబడి జాతీయ రహదారి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌తో కలిసి తాను కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం సమ్మతి తెలిపిందని, దీంతో డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్త యితే తీరప్రాంతం వెంబడి వివిధ పరిశ్రమలు, హోట ల్స్‌ ఏర్పడి పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెంది ఎం తోమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అనంతరం ప లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ఎల్‌ఎల్‌ నాయుడు, అట్టాడ రాంప్రసాద్‌, రెడ్డి అప్పన్న బాడాన వెంకటరమణమ్మ, ఆరంగి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:58 PM