తొలగిన అడ్డంకులు
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:21 AM
మున్సిపాలిటి ఏర్పడి 25 ఏళ్లు అవుతున్నా తాళభద్ర-నర్సిపురం ప్రజల చిరకాలవాంఛ పక్కా రహదారికి అనేక ఆంక్షలు అడ్డొచ్చాయి. ఈ రహదారి పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఉండడంతో పాటు పూర్తిగా రైల్వేశాఖ పరిధిలోకి రావడంతో మున్సిపల్ అధికా రులు రహదారి నిర్మాణాన్ని చేపట్టలేకపోయారు.
తాళభద్ర-నర్సిపురం రహదారికి మార్గం సుగమం
హద్దులు గుర్తించి కంచె వేస్తున్న రైల్వేశాఖ
నెరవేరనున్న దశబ్దాల నాటి కల
పలాస, జూలై 29(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటి ఏర్పడి 25 ఏళ్లు అవుతున్నా తాళభద్ర-నర్సిపురం ప్రజల చిరకాలవాంఛ పక్కా రహదారికి అనేక ఆంక్షలు అడ్డొచ్చాయి. ఈ రహదారి పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఉండడంతో పాటు పూర్తిగా రైల్వేశాఖ పరిధిలోకి రావడంతో మున్సిపల్ అధికా రులు రహదారి నిర్మాణాన్ని చేపట్టలేకపోయారు. అప్పటి కేంద్రమంత్రిగా పనిచేసిన దివంగతనేత కింజరాపు ఎర్రన్నాయుడు సైతం రహదారి కోసం పోరాడి రైల్వేశాఖ ఆంక్షలు కారణంగా చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కింజ రాపు రామ్మోహన్‌నాయుడు దృష్టికి ఈ రోడ్డు సమ స్య తీసుకువెళ్లినా.. ఆయన సైతం మౌనం దాల్చా న్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మూడో రైల్వేలైన్ నిర్మిస్తు న్న నేపథ్యంలో పక్కాగా హద్దులు గుర్తించాల్సి వ చ్చింది. దీంతో పాటుగా మొత్తం రైల్వే భూములకు రక్షణగా పక్కా గోడల నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. అందులో భాగంగా తాళభద్ర ఎల్‌సీ గేటు నుంచి కాశీబుగ్గ ఎల్‌సీ గేటు వరకూ సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మాణం పనులు చురుగ్గా సాగుతు న్నాయి. మరో నెలలో మొత్తం పనులన్నీ పూర్తయ్యే అ వకాశాలున్నాయి. ఈ నే పథ్యంలో తాళబధ్ర- నర్సిపురం రహదారి మ రోమారు తెరపైకి వచ్చిం ది. ఈ రహదారి నిర్మా ణం జరిగితే రెండు గ్రా మాలకు లింకు రోడ్డు ఏ ర్పడడంతో పాటు వజ్రపుకొత్తూరు మండలవా సులకు కాశీబుగ్గ రోడ్డును దాటకుండా పాత జా తీయ రహదారి మీదుగా శ్రీకాకుళం, విశాఖ వంటి దూరప్రాంతాలకు వెళ్లడానికి మార్గం ఏర్పడుతుం ది. దీంతో గంటల కొద్ది గేటువద్ద వేచి ఉండకుండా రెండు రైల్వేగేట్లు తగలకుండా వెళ్లడానికి వీలవు తుంది. గతంలో మున్సిపాలిటి అధికారులు రహ దారి నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకున్నా రైల్వేశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ పనులు వెనక్కు మళ్లాయి. ప్రస్తుతం రైల్వేశాఖ తమ పరిధిలో భూములకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టి నర్సిపురం-తాళభద్ర రహదారిని విడిచిపె ట్టింది. దీంతో పక్కా రహదారి ఏర్పాటు చేయడా నికి మార్గం సుగమం కావడంతో ప్రజలు పక్కా రహదారికోసం ఎదురుచూస్తున్నారు. 24 అడుగుల వెడల్పుమేరకు రహదారి నిర్మించడానికి అవకాశా లు ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఆర్థిక నిధులు వెచ్చించి ఈ రహదారికి మోక్షం కల్పించాలని ఆ యా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:21 AM