ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీసీసీ అధ్యక్షుడి తీరుతో పార్టీకి నష్టం

ABN, Publish Date - Jun 26 , 2025 | 12:14 AM

డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు పనితీరుతో పార్టీకి నష్టమేనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు.

సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు

అరసవల్లి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు పనితీరుతో పార్టీకి నష్టమేనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ మేరకు తీర్మానాలను చేసి అధిష్ఠానానికి పంపించేందుకు నిర్ణయించారు. ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన గురించి తమకు ముందుగా తెలియజేయలేదని, కనీసం ఏ ఒక్క సీనియర్‌ నాయకునికి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఆయన పనితీరుని వ్యతిరేకించే వారిపై అధిష్ఠానానికి తప్పుగా ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. అంబటి కృష్ణ పనితీరుపై పీసీసీ దర్యాప్తునకు పూనుకోవడం మం పరిణామమన్నారు. విచారణను పారదర్శకంగా నిర్వహించాలని, జిల్లా పార్టీ శ్రేణులకు న్యాయం చేయాలని వారు కోరారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యేందుకు నిరంతరం కృషి చేస్తున్న తమను డీసీసీ అధ్యక్షుడు నిత్యమూ అవమానిస్తూ, కేసులు పెడుతూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ పార్టీ ఇన్‌చార్జి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పేడాడ పరమే శ్వరరావు, నాయకులు సనపల అన్నాజీరావు, చింతాడ దిలీప్‌, మజ్జి మురళీమోహన్‌, కరిమజ్జి మల్లేశ్వరరావు, బస్వా షన్ముఖరావు, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:14 AM