ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీముఖలింగంలో శివస్వాముల సందడి

ABN, Publish Date - Jul 21 , 2025 | 11:36 PM

దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీముఖలింగంలో శివస్వాముల సందడి మొదలైంది. శ్రావణమాసం ప్రారంభానికే ముందే స్వాములు శివదీక్షను చేపట్టి భక్తిశ్రద్ధలతో పరమేశ్వరునికి పూజలు చేస్తారు. సోమవారం అనేకమంది శివస్వాములు శ్రీముఖలింగంలో గల మధుకేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయం వద్ద ప్రదక్షిణలు చేస్తున్న శివస్వాములు

జలుమూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీముఖలింగంలో శివస్వాముల సందడి మొదలైంది. శ్రావణమాసం ప్రారంభానికే ముందే స్వాములు శివదీక్షను చేపట్టి భక్తిశ్రద్ధలతో పరమేశ్వరునికి పూజలు చేస్తారు. సోమవారం అనేకమంది శివస్వాములు శ్రీముఖలింగంలో గల మధుకేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడిశాలోని రాయఘడ, పర్లాకిమిడి గ్రామాలకు చెందిన శివస్వాములు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి... వంశధార నదీ జలాలతో శ్రీముఖలింగేశ్వరునికి అభిషేకం చేశారు.

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని

గ్రామోత్సవం

సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. సాయంత్రం గర్భగుడిలో గల పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను బయటకు తెచ్చి నూతన వస్త్రాలు ధరించి పూలమాలలుతో అలంకరించారు. ప్రత్యేక పల్లకిలో ఆసీనులను చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో పార్వతీ పరమేశ్వరుల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో వాసుదేవరావు, అర్చకులు నారాయణమూర్తి, వెంకటాచలం, శివ, అచ్యుత, యోగి, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:36 PM