ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వంశధార ఎడమ కాలువ గట్టుకు గండి

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:00 AM

: గొట్టాబ్యారేజీ ఎడమ ప్రధాన కాలువకు మళ్లీ గండిపడింది. ఈనెల రెండోతేదీన నీరు విడిచిపెట్టిన తర్వాత రెండసారి గండి పడడం తో వంశధారఅధికారులు తలలుపట్టుకుంటున్నారు.

పిండ్రువాడ కాలనీ సమీపంలో వంశధార కాలువ గట్టుకు పడిన రంధ్రం

హిరమండలం, జూన్‌14(ఆంధ్రజ్యోతి): గొట్టాబ్యారేజీ ఎడమ ప్రధాన కాలువకు మళ్లీ గండిపడింది. ఈనెల రెండోతేదీన నీరు విడిచిపెట్టిన తర్వాత రెండసారి గండి పడడం తో వంశధారఅధికారులు తలలుపట్టుకుంటున్నారు. సోమవారం ఉదయం మండలం లోని పిండ్రువాడకాలనీ సమీపంలో 5ఆర్‌ స్లూయిస్‌ వద్ద గట్టుకు గండి పడి పంటపొ లాల్లో నీరుచేరడంతో రైతులు గుర్తించారు. వెంటనే వంశధార అధికారులలకు సమా చారం అందించారు.గొట్టాబ్యారేజీ ఈఈ మురళీమోహన్‌,ఏఈఈ ధనుంజయరావుతో పాటు సిబ్బందిగండిపడిన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. స్లూయిస్‌ పక్క నుంచి రంధ్రం ఏర్పడడంతో గట్టులోపలికి నీరు ప్రవహించింది.క్రమేపి గట్టు మొత్తం కోరు కుపోయింది.ఈవిషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతోవారి ఆదేశాల మేరకు కాలువలో నీటివిడుదలను నిలిపివేశారు.గండిపూడ్చే పనులు యుద్దప్రాతిపాదిక చేప ట్టారు. కాగా ఎడమ కాలువ గట్టుకు గండి పడిన ప్రదేశానికి దగ్గరలోనే మరో స్లూయిస్‌ వద్ద గట్టుకు రంధ్రం ఏర్పడింది.వంశధార ఈఈ దీన్ని గుర్తించి గండిపడక ముందే మరమ్మతులు చేపట్టాలని ఏఈకి ఆదేశించారు.ఈ పనులను మంగళవారం చేపట్టనున్న ట్లు అధికారులు తెలిపారు. కాగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోమవారం సాయంత్రం 500 క్యూసెక్కుల నీటిని కాలువలోకి విడిచిపెట్టారు.

Updated Date - Jul 15 , 2025 | 12:00 AM