ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కల్యాణ వైభోగమే..

ABN, Publish Date - May 08 , 2025 | 11:40 PM

స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న శ్రీదేవి, భూదేవి సహిత వైభవ వేంక టేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

జలుమూరు: సత్యనారాయణస్వామి కల్యాణంలో పాల్గొన్న భక్తులు

టెక్కలి, మే 8(ఆంధ్రజ్యోతి): స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న శ్రీదేవి, భూదేవి సహిత వైభవ వేంక టేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వ దినం సందర్భంగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం కనులపండువగా చేపట్టారు. భక్తులు కల్యానాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్య క్రమంలో అర్చకుడు నానీబాబు, నేతలు లమ్మత మధు, రాంప్రసాద్‌, బాలకృష్ణ, నారాయణ, ప్రసాద్‌రెడ్డి, జగ న్నాఽథం, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

గొటివాడలో..

జలుమూరు, మే 8(ఆంధ్రజ్యోతి): గొటివాడ గ్రామంలో కొలువు తీరిన వీర వెంకట సత్యనారాయణ స్వామి కల్యాణం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అర్చకులు మాగంటి ప్రసాద్‌ నేతృత్వంలో స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణతో పాటు స్వామివారి కల్యాణం చేపట్టారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో గొటివాడతో పాటు సైరిగాం, మూర్తిపేట, పాగోడు, రామయ్యవలసలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

నందిగాం, పెంటూరుల్లో..

నందిగాం, మే 8(ఆంధ్రజ్యోతి): నందిగాం, పెంటూరు గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి కల్యాణం గురువారం కనుల పండువగా జరిగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. ధర్మకర్తలు బొడ్డ జనార్దనరావు, కృష్ణారావు, నారా యణరావు, సనపల సీతారాం ఆధ్వర్యంలో వేదపండితు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వంశ ధార ఎస్‌ఈ పీవీ తిరుపతిరావు, యూటీఎఫ్‌ జిల్లా కార్య దర్శి బి.శంకరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:40 PM