ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నగరంలో ఆవేటి వారాల సందడి

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:25 PM

నగరంలో మంగళవారం ఆవేటి వారాల సందడి నెలకొంది. బలగ భద్రమ్మ గుడి, ఏపీహెచ్‌బీ కాలనీ లోని అసిరమ్మ, కిన్నెర థియేటర్‌ సమీపంలోని ము త్యాలమ్మ అమ్మవార్ల ఆవేటి సంబరాలను భక్తులు అంగ రంగవైభవంగా నిర్వహించారు.

ఘటాలను తీసుకువెళుతున్న భక్తులు

శ్రీకాకుళం కల్చరల్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): నగరంలో మంగళవారం ఆవేటి వారాల సందడి నెలకొంది. బలగ భద్రమ్మ గుడి, ఏపీహెచ్‌బీ కాలనీ లోని అసిరమ్మ, కిన్నెర థియేటర్‌ సమీపంలోని ము త్యాలమ్మ అమ్మవార్ల ఆవేటి సంబరాలను భక్తులు అంగ రంగవైభవంగా నిర్వహించారు. భక్తులు కలశా లతో భారీ ఊరేగింపులతో ఆలయాలకు వచ్చి అమ్మవార్లకు చల్లదనం చేసి మొక్కులు చెల్లించు కున్నారు. అమ్మవార్ల పాదాలు కడిగి ప్రత్యేక పూజ లు చేసి వివిధ రకాల పుష్పా లతో అలంకరించారు. ఫాజుల్‌బేగ్‌ పేటలోని భద్రమ్మ తల్లికి అర్చకులు పన్నాల నరసింహమూర్తి ఆధ్వ ర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజ లు నిర్వహించారు. అమ్మవారి జంగిడీలు మోస్తూ తల్లి వద్దకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నీలమ్మ తల్లి, నక్కవీధిలో ఉన్న ఉమాదేవికి కోదండ రామాలయంలో ఉన్న లక్ష్మీదేవికి మహా లక్ష్మి కాలనీలో ఉన్న కాత్యాయని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పుల వాయి ద్యాలతో భారీ ఊరే గింపులు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది.

Updated Date - Jul 15 , 2025 | 11:25 PM