రాష్ట్ర సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అశోక్
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:19 PM
రాష్ట్ర సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే ఏడాది పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిం దని ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ అన్నారు.
ఇచ్ఛాపురం, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే ఏడాది పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిం దని ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ అన్నారు. బుధవారం మండపల్లి పంచాయితీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీచేసి పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం, పీఏసీఎస్ అధ్యక్షుడు పెదిని బాబ్జీ, నేతలు మేరుగు సూర్యనారాయణ, దూపాన సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ దక్కత డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.
సుపరిపాలనే ధ్యేయం: శంకర్
అరసవల్లి, జూలై 16(ఆంధ్రజ్యోతి): సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగర పరిధిలోని హయా తినగరం 43, 44, 45 వార్డుల్లో బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమం లో నగర టీడీపీ అధ్య క్షుడు మాదారపు వెంకటేష్, నేతలు జామి భీమశంకరరావు, కవ్వాడి సుశీల, కొమర కమల పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 11:19 PM