ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - May 17 , 2025 | 12:20 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

యంత్ర పరికరాల పంపిణీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, మే 16(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎంఏఎం, ఎఫ్‌ఎన్‌ఎస్‌ పథకం ద్వారా రైతులకు రాయితీపై వ్యవ సాయ యంత్ర పరికరాల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభు త్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమర్థుడైన చంద్రబాబులాంటి ముఖ్యమంత్రి ఉండాలని, సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా నడిపిస్తున్నారని కొనియాడారు. తొందరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయన్నారు. అనంతరం రైతులకు యంత్ర పరికరాలను అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చం ద్రశేఖర్‌, మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోనెల అప్పారావు, వ్యవసాయశాఖ జేడీ కె.త్రినాధస్వామి, ఏడీ బగ్గు రజని, ఏవో మెట్ట మోహన్‌రావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:20 AM