పేద ల సాధికారతే పీ-4 లక్ష్యం
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:15 AM
రాష్ట్రంలో పీ-4 కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంలా తీర్చిదిద్దుతున్నామని, పేదల సాధికారతే పీ-4 లక్ష్యమని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీ-4 కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంలా తీర్చిదిద్దుతున్నామని, పేదల సాధికారతే పీ-4 లక్ష్యమని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్ట ర్లు, జేసీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు కుటుంబాలు మార్గదర్శుల మద్దతుతో ఎదిగేలా చర్యలు చేపడు తున్నామన్నారు. ప్రతీ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, పారిశ్రామిక వేత్తలు, ఎన్‌ఆర్ ఐలు బంగారు కుటుం బాలను దత్తత తీసుకోవాలన్నారు. ఆగస్టు 10వ తేదీ లోగా సర్వే పూర్తి చేయాలని, 15 నాటికి 15లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేను స్వయంగా 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నానని, నా నుంచే ఇది ప్రారంభమవుతుంది. వీడి యో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, నడుకురిటి ఈశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, సీపీవో ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 12:15 AM