ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

ABN, Publish Date - Apr 10 , 2025 | 11:44 PM

వచ్చే స్థానిక ఎన్నికల్లో నూరుశాతం స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పని చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గురువారం ఆమె మండల పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృ త స్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

మెంటాడ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): వచ్చే స్థానిక ఎన్నికల్లో నూరుశాతం స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పని చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గురువారం ఆమె మండల పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృ త స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. అన్ని గ్రామాలకు తాగునీరు, రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చేసిన మంచిని చెప్పుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. స్థానికంగా ప్రభుత్వ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమీ క్షించి... స్పందనకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయం తో పనిచేయాలని చెప్పారు. అధికారిక కార్యక్రమాల్లో జనసేన, బీజేపీని కలుపుకొని వెళ్లాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై విపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టి ప్రజల ముందు వాస్తవాలను ఉంచాలని ఆమె సూచించారు. ఐదేళ్ల విధ్వంస పాలనతో దెబ్బతిన్న రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చలుమూరి వెంకటరావు, నాయకులు జి.అన్నవరం, రెడ్డి ఆదినారాయణ, ఆర్‌.రవిశంకర్‌, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

లెవెన్‌ రెడ్డికేం తెలుసు పి-4 గొప్పతనం?

శవ రాజకీయాలు, విధ్వంసం తప్ప పాలన చేతకాని లెవెన్‌(11)రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు అమల్లోకి తెచ్చిన చరిత్రాత్మక పి-4 గురించి ఎలా తెలుస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. గురువారం మెంటాడలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. పి4 నిర్వచనం పలకడానికి జగన్‌ రెడ్డికి నోరు తిరగడం లేదని ఎద్దే వా చేశారు. ఈ కార్యక్రమం అణగారిన వర్గాలకు ఆశాదీపం వంటిదని అభివర్ణించారు. చంద్రబాబు కార్యదక్షతతో కచ్చితంగా విజయవంతమవుతుందని చెప్పారు. పోలీసులపై జగన్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బేషరతు క్షమా పణలు చెప్పాలని సంధ్యారాణి డిమాండ్‌ చేశారు. బట్టలూడదీయడానికి అవి బజారులో దొరికే డ్రెస్సు లు కాదని, కఠోర శిక్షణ, శ్రమతో సాధించుకున్న ఉద్యోగానికి, దేశభక్తికి ఆది ప్రతీక అని సంధ్యారాణి అన్నారు. నాడు పోలీసులతో వెట్టి చాకిరీ చేయించు కొని, వారు లేనిదే బయటకు కాలుపెట్టలేని జగన్‌... ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే పిచ్చి ముదిరి.. మందులు వేసుకోవడం మానేశారేమోనని మంత్రి వ్యాఖ్యానించారు. తలకిందలుగా తపస్సు చేసినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని తెలిసి కూ డా జగన్‌ రెడ్డి కేడర్‌ను మభ్యపెట్టడానికి మళ్లీ సీఎం అవుతానంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - Apr 10 , 2025 | 11:44 PM