ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎన్‌ఈఆర్‌

ABN, Publish Date - Jul 28 , 2025 | 11:50 PM

ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటు న్నామని ఎమ్యెల్యే నడుకుదిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్‌) అన్నారు. సోమవారం నడిమివలసలో ‘నమస్తే ఎచ్చెర్ల-మన ఊరికి మన ఎమ్యెల్యే’ కార్యక్రమం నిర్వహించారు.

సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

జి.సిగడాం, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటు న్నామని ఎమ్యెల్యే నడుకుదిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్‌) అన్నారు. సోమవారం నడిమివలసలో ‘నమస్తే ఎచ్చెర్ల-మన ఊరికి మన ఎమ్యెల్యే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంద న్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలా ముం దుకు తీసుకువెళ్లాలో ఆలోచించ గల విజన్‌ ఉన్న నాయ కులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, తాగునీరు అందించి అభివృద్ధి చెందిన గ్రామాలుగా తీర్చి దిద్దిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్ర మంలో కూటమి నేతలు కుమరాపు రవికుమార్‌, పైల విష్ణుమూర్తి, మీసాల రవికుమార్‌, వజ్జపర్తి రఘురాం, కామోజుల సీతారాం, ఎంపీడీవో రామకృష్ణ, డీటీ నిర్మల, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తోటపల్లి నీరు సకాలంలో విడుదల చేయాలి

రణస్థలం, జూలై 28(ఆంధ్రజ్యోతి): తోటపల్లి కాలువ ద్వారా నీటిని సకాలంలో విడుదల చేసి శివారు ప్రాంతాలకు సరఫరా చేయాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నా రు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో తోటపల్లి కాలువ అధికారులతో సమీక్షించారు. రొటేషన్‌ విధానంలో నీటి పంపిణీ జరుగుతోందని, త్వరలో నీరు వస్తుందని అధికా రులు వివరించారు. కార్యక్రమంలో డీఈ లావణ్య, ఏఈ కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 11:50 PM