ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి నిర్మూలనే లక్ష్యం

ABN, Publish Date - May 29 , 2025 | 11:40 PM

:జిల్లాలో గంజాయి,సారా, బెల్ట్‌ షాపులను పూర్తిస్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పైడి రామచంద్రరావు తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావే శంలో రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు 811 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు నిర్వహించినట్లు తెలిపారు.

మాట్లాడుతున్న రామచంద్రరావు:

శ్రీకాకుళం క్రైం, మే 29(ఆంధ్రజ్యోతి):జిల్లాలో గంజాయి,సారా, బెల్ట్‌ షాపులను పూర్తిస్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పైడి రామచంద్రరావు తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావే శంలో రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు 811 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని 12 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో అక్టోబర్‌ నుంచి1,537 నేరాలను నమోదు చేశామని, అం దులో 1427 మందిని అరెస్టు చేశామని,28 వాహనాలను సీజ్‌ చేశామని చెప్పారు. జిల్లాలో 954 బెల్ట్‌ షాపులను మూసివేయించి 954 మందిని అరెస్టు చేసి, 1491 లీటర్ల లిక్కర్‌ను సీజ్‌ చేశామన్నారు. ఒడిశానుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకొని 83 కేసులు నమోదుచేయగా 82మందిని అరెస్టు చేసి 52.37 లీటర్ల బీరు, లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని పదివాహనాలను సీజ్‌చేశామన్నారు. ఒడిశా నుంచి తరలిస్తున్న 40.32 కేజీల గంజాయిను పట్టుకొని మూడు కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశామన్నారు.జిల్లాలో బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించిన 111 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. సారాకు సంబంధించిన 385 కేసులు నమోదు చేయగా, 270మందిని అరెస్టు చేసి 4,131 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని, 1500 వాహనాలను సీజ్‌ చేశామని చెప్పారు. జనవరి నుంచి నవోదయం2.0కార్యక్రమంద్వారాసారాను నిర్మూలిస్తున్నామన్నారు. మద్యం షాపుల్లో కల్తీలిక్కర్‌పై నిఘా ఏర్పాటు చేశామని, ఎక్సైజ్‌ ఐ యాప్‌ ద్వారా నిరం తరం సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అనుమా నం వస్తే విశాఖలోని అల్ర్టామోడరన్‌ ల్యాబ్‌కు లిక్కర్‌ను తరలించి పరీక్షలు నిర్వహించి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - May 29 , 2025 | 11:40 PM