ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లోకేష్‌తోనే యువత భవిత సాధ్యం

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:10 AM

యువత భవితను దెబ్బతీసింది వైఎస్‌ జగనే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కల మట వెంకటరమణ విమర్శించారు. యువత భవిత లోకేష్‌తోనే సాధ్యమని తెలిపారు.

మాట్లాడుతున్న వెంకటరమణ :

శ్రీకాకుళం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): యువత భవితను దెబ్బతీసింది వైఎస్‌ జగనే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కల మట వెంకటరమణ విమర్శించారు. యువత భవిత లోకేష్‌తోనే సాధ్యమని తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ మట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకం గా రూ.4,271 కోట్లు ఫీజు, వసతి దీవెన బకాయిలు పెట్టేశార న్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారని తెలి పారు. కానీ జగన్‌ తొమ్మిది లక్షల మందికి కుదించేసి ఏడు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ హామీపై జగన్‌ మాట తప్పారన్నారు. కమీషన్ల కోసం పరిశ్రమలపై దాడులు చేసి జగన్‌ ప్రభుత్వం పెట్టుబడుల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి నిరుద్యోగం పెంచిందని చెప్పారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, బి.భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:10 AM