వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:17 PM
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసిందని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, జూన్ 17(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసిందని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళ వారం శ్రీకాకుళంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ‘బెంగళూ రు నుంచి ఒకసారి రాష్ట్రానికి వచ్చి జగన్ షికారు చేసుకుని వెళ్తున్నాడు. పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం ఖాళీ చేసింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను అమలు చేస్తున్నాం. ఈ విషయంలో గత ప్రభుత్వం విఫలమైంది. అమ్మఒడి పథకం అని చెప్పి ఎంతమంది చిన్నారులుంటే అంతమందికీ ఇస్తామని అప్పుడు ప్రకటించి ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. ప్రజలను నమ్మించి మోసం చే సిన వ్యక్తి జగన్. గత ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారు. అక్రమ అరెస్ట్‌లతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు పెట్టారు. ఐదేళ్లు ప్రజలు బయటకు రావడానికి కూడా భయ పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. పేదవాడికి అన్నం పెట్టడం ఇష్టం లేక అన్న క్యాంటీన్లు మూసి వేయించారు. ఉపా ధ్యాయ ఉద్యోగాల భర్తీచేస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. మహి ళలకు మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తా మని హామీ ఇచ్చాం.. అమలు చేశాం’ అని స్పష్టం చేశారు.
Updated Date - Jun 17 , 2025 | 11:17 PM