బాలియాత్రను అధికారికంగా నిర్వహించాలి
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:50 PM
బాలియాత్రను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు కోరారు. గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సం దర్భంగా మాట్లాడుతూ సాంస్కృతిక, సంప్రదాయాలను ఇనుమడింపజే సే బాలియాత్ర ఏటా శ్రీముఖలింగంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
జలుమూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బాలియాత్రను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు కోరారు. గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సం దర్భంగా మాట్లాడుతూ సాంస్కృతిక, సంప్రదాయాలను ఇనుమడింపజే సే బాలియాత్ర ఏటా శ్రీముఖలింగంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలియాత్ర కమిటీ ప్రతినిధి దువ్వాడ జీవితేశ్వరరావు, బొడ్డేపల్లి నేతాజీ, శ్రీముఖలింగం సర్పంచ్ తమ్మన్నగారి సతీష్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ తర్ర బలరాం, అర్చకులు ఎస్.వెంకటాచలం, నాయుడుగారి జనార్దన, పంచాది నారాయణమూర్తి, శివ, సీపాన రాము, చింతాడ వెంకటరావు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు జీడి వ్యాపారుల అభినందన
పలాస, జూలై 17(ఆంధ్రజ్యోతి): పలాస జీడిపప్పుకు ప్రతిష్టాత్మకమైన వన్ డిస్ట్రెక్ట్-వన్ ప్రొడక్ట్ కార్యక్రమం కింద జాతీయస్థాయి అవార్డు లభిం చడంతో కలెక్టర్ స్వప్నిక్ దినకర్ ఫుండ్కర్‌కు పలాస పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల, ఆలిండియా క్యాజూ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. పలాస జీడి పప్పుకు లభించిన అవార్డును ఇటీవల కలెక్టర్ ఢిల్లీలో అందు కున్న విషయం విదితమే.ఈనేపథ్యంలోగురువారం కలెక్టర్‌నుఏఐసీఏ సభ్యు డు మల్లా కాంతారావు, పారిశ్రామికవాడ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, కార్యదర్శి తూముల శ్రీనివాసరావు, కోశాధికారి కె.వినయ్, తాళాసు శ్రీను, సుడియా రత్నాకర్, కొంచాడ సందీప్ అభినందించారు. కాగా ఈనెల 24 నుంచి మూడురోజుల పాటు జరిగే ఆలిండియా క్యాషూ కన్వెన్షన్‌కు హాజ రుకావాలని కలెక్టర్‌కు పారిశ్రామికవేత్తలు ఆహ్వానించారు.
Updated Date - Jul 17 , 2025 | 11:50 PM