దక్షిణ కోస్తా రైల్వేజోన్ జీఎం నియామకం హర్షణీయం
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:29 AM
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు మరో ముందడుగు పడిందని.. రైల్వే జోన్‌కు తొలి జీఎంగా సందీప్ మాధుర్‌ను కేంద్రప్రభుత్వం నియమించడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు మరో ముందడుగు పడిందని.. రైల్వే జోన్‌కు తొలి జీఎంగా సందీప్ మాధుర్‌ను కేంద్రప్రభుత్వం నియమించడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు శరవేగంగా జరుగు తుందని చెప్పారు. రైల్వే జోన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నారని వివరించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైల్వే జోన్ పనులు నిలిచిపోయాయని విమర్శించారు. జోన్‌కు అవసరమైన 54 ఎకరాల భూమి కేటాయించకుండా నిర్లక్ష్యం వహించారని.. దీనివల్ల వైసీపీ ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. విశాఖ రైల్వే జోన్‌పై గజిట్ నోటిఫికేషన్ త్వరలో ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 12:29 AM