ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమితోనే ఉత్తరాంరఽధ నాయకులకు గుర్తింపు

ABN, Publish Date - Jul 27 , 2025 | 11:32 PM

ఉత్తరాంధ్రలోని నాయకులకు దేశ స్థాయిలో గుర్తింపు కల్పించడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛా పురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రను వినాశనానికి పూనుకున్నారని ఆరోపించారు.

మాట్లాడుతున్న బెందాళం అశోక్‌:

కవిటి, జూలై27(ఆంధ్రజ్యోతి):ఉత్తరాంధ్రలోని నాయకులకు దేశ స్థాయిలో గుర్తింపు కల్పించడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛా పురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రను వినాశనానికి పూనుకున్నారని ఆరోపించారు. ఆదివారం రామయ్యపుట్టుగలో విలే కరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర భూములు కొల్లగొట్టి లబ్ధిపొందాలని వైసీపీ యత్నించిందన్నారు. సాధారణ కార్యకర్తను పార్లమెంట్‌ సభ్యుడిగా అప్పలనాయు డును పంపించారన్నారు. విశాఖ కేంద్రంగా ప్రఖ్యాత కంపెనీలు వచ్చేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

టీడీపీలోనే కార్యకర్తలకు గౌరవం

కార్యకర్తలను గౌరవించడం కేవలం టీడీపీకే సాధ్యమని ఎమ్మెల్యే అశోక్‌ తెలి పారు. ఆదివారం ఎర్రగోవిందపుట్టుగలో కవిటి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎర్ర బాసు దేవ్‌ ప్రధాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా సామంత కుల సమా వేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.సంక్షేమాన్ని అమలు చేస్తున్నా వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. సామంత కులస్థులు అభ్యు న్నతికి పాటుపడతానని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్రప్రకాష్‌, నేతలు బి.రమేష్‌, మధు, రంగా రౌళో, ఎస్‌వీ రమణ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:32 PM