ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉగ్రవాదాన్ని అంతమొందించాలి

ABN, Publish Date - Apr 27 , 2025 | 11:44 PM

ఉగ్రవాదాన్ని అంతమొందించి, అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని శ్రీనివాసాచార్యులపేట గ్రామస్థులు కోరారు.

ఆమదాలవలస: కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

ఆమదాలవలస, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదాన్ని అంతమొందించి, అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని శ్రీనివాసాచార్యులపేట గ్రామస్థులు కోరారు. ఆదివారం సర్పంచ్‌ బొడ్డేపల్లి గౌరీపతి ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఇటువంటి మతన్మోదాన్ని తుదముట్టించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

కఠినంగా శిక్షించాలి

జి.సిగడాం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ ఆదివారం పాలఖండ్యాం-మెట్టవలస కూడలి పలువురు నిరసన తెలిపారు. విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు ఆ దాడిలో మృతి చెందినవారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పర్యాటకులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గర్లంకి శ్రీనివాసరావు, పలిశెట్టి సూర్యనారాయణ, ఎం.ఈశ్వరరావు, పి.వేణు, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:44 PM