గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు
ABN, Publish Date - May 12 , 2025 | 11:49 PM
గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఫస్ట్‌క్లాస్ ఏడీజే కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం తీర్పు ఇచ్చినట్లు పలాస రైల్వే ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్ తెలిపారు.
పలాస, మే 12(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఫస్ట్‌క్లాస్ ఏడీజే కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం తీర్పు ఇచ్చినట్లు పలాస రైల్వే ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా వల్లాడ గ్రామానికి చెందిన అనంతసబార్, రుణకుండంగి 2003 ఆగస్టు 27న 82 కిలోల గంజాయిని ముంబై తరలించేందుకు పలాస రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫారం-2లో వేచి ఉండ గా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని పట్టుకుని అప్పటిలో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. దీనిపై విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు, రూ.లక్ష అపరాధ రుసుం విధించారు. ఈ కేసును జిల్లా ప్రభుత్వ న్యాయవాది కింజరాపు శ్రీనివాసరావు వాదించారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
కొత్తూరు, మే 12(ఆంధ్రజ్యోతి): మండల పరిధి పోనుటూరు గ్రామం వద్ద వంశధార నది నుం చి అక్రమంగా ఇసుకను తరలి స్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహసీ ల్దార్ పి.బాలకృష్ణ తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నా యి.. ఇసుక తరలింపునకు, స్టాక్ పాయింట్‌కు ఎటువంటి అనుమతులు లేకపోయినా యంత్రాలతో నదీ గర్భంలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలి స్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సచివాలయ సిబ్బంది పట్టుకుని సమాచారం ఇచ్చారు. వాహనాలను కార్యాలయానికి తరలించామన్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు జరిమానా వేసినట్లు తెలిపారు.
చికిత్సపొందుతూ ఒకరి మృతి
రణస్థలం, మే 12(ఆంధ్రజ్యోతి): రణస్థలం లోని ఓ ఆస్పత్రిలో ఒకరు చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. జే ఆర్‌పురానికి చెందిన బి.హరీష్ (25)తోపాటు గొర్లె భాషా మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై పైడిభీమ వరం నుంచి రణస్థలం ఆదివారం అర్థరాత్రి వస్తు న్నారు. వరిసాం జంక్షన్ వద్ద ఆగిఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో గాయపడిన హరీష్ రణస్థలం ఒక ప్రైవే టు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హరీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్త శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గొర్లె బాష ఇచ్చిన ఫిర్యాదు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో క్లీనర్..
లావేరు, మే 12 (ఆంధ్రజ్యోతి) : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రావివలస వద్దగల జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ బెల్లంకొండ రమేష్ (37) మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీకాకుళం నుంచి పైడిభీమవరం వైపు మూడు లారీలు వరుసగా వస్తున్నాయి. ఇందులో మధ్యలో ఉన్న ఐరెన్‌లోడుతో ఉన్న లారీ ముందు ఉన్న గ్రానైట్ లారీని ఢీకొంది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఐరెన్ లారీ తవుడు లోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో అందులో ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్లీనర్ రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకా కుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు చెప్పారు.
మహిళకు తీవ్ర గాయాలు..
ఎచ్చెర్ల, మే 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని కుశాలపురం గ్రామానికి సమీపంలో శ్రీకాకుళం సింహద్వారం వద్ద సోమవారం జరిగిన ప్రమాదం లో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసుల కథనం మేరకు.. లావేరు మండలంలోని బుడుమూరు గ్రామానికి చెందిన గుడ్ల లావణ్య నవభారత్ జంక్షన్‌లోని తన కన్నవారింటికి స్కూటీపై సోమవారం ఉద యం వచ్చింది. ఆమె తిరిగి బుడుమూరు వెళ్లే క్రమంలో కుశాలపురం సింహద్వారం వద్ద సర్వీసు రోడ్డులో స్కూటీతో యూటర్న్ తీసుకుంటుం డగా బొబ్బిలి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరిన ఆమెను 108 అంబులెన్స్‌పై తీసుకెళ్లి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పిం చారు. ఆమె భర్త గుడ్ల సూర్య ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎన్.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - May 12 , 2025 | 11:49 PM