ఇంటర్ విద్యార్థులకు ప్రతిభ అవార్డులు
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:33 AM
ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్ధులకు నగదు పురస్కారాలను అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో 34 మంది ఎంపిక
నరసన్నపేట, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్ధులకు నగదు పురస్కారాలను అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా అధికారుల ప్రతిపాదనలు మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివి, ఉత్తమ ఫలితాలు సాధించిన 34 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులను ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి రూ.20వేల చొప్పున నగదు బహమతులు అందజేయనున్నది. ఈ పురస్కారాలను ఈనెల 9న ప్రదానం చేయను న్నట్టు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లా నుంచి ఎంపికైన వారు వీరే.. గొట్టాపు ప్రియంక (కాశీబుగ్గ), రెయ్య లిఖిత (సింగుపురం), ఉపమాక సాయిహారిక (శ్రీకాకుళం), షేక్ రుషిద్ (ఇచ్ఛాపురం), మలపాక లక్ష్మీలిఖిత(శ్రీకాకుళం), సవర సుస్మిత (సింగుపురం), కె.పద్మజ (పలాస), కొండా మీనాక్షి (బారువ) ఎం.సాయిఅభిరామ్(బలగ) ఎ.మధులత(శ్రీకాకుళం), ఎస్.సబీర్ (మందస), కె.లక్ష్మీప్రియ (పలాస), ఎస్.సుధీర్(టెక్కలి), కె.యుగంధర్(పలాస), ఎస్.ప్రదీప్ (టెక్కలి), వీఎస్‌ఎస్ కృష్ణప్రవల్లిక (బలగ) కె. జగదీష్ (పురుషోత్తపురం), సీహెచ్.స్వాతి (నరసన్నపేట), సాధు హేమాంజలి(పాతశ్రీకాకుళం), ఎం.వీ సూర్యశ్రీస్నాయిత (బలగ), పి.సిద్ధు (సింగుపురం) పి.జోసఫ్‌శామ్యూల్ (శ్రీకాకుళం), నగరి హన్సిక (పలాస), డి.అలేఖ్య (సోంపేట), డి.స్వప్న, కె.సాయి (ఆమదాలవలస), ఫాతిమా తివేశం(పాతశ్రీకాకుళం) బి.అంజలి (బలగ), సవర రాజ్ కుమార్ (టెక్కలి), కె.రూప (కరవంజి), పి.ఢిల్లీశ్వరరావు (నరసన్నపేట), బి.దేవశ్రీ (పాతపట్నం), కె.జ్ఞానేశ్వరి (శ్రీకాకుళం), డి.అరుణ (సోంపేట).
అంధ విద్యార్థికి..
నరసన్నపేటలోని జ్ఞానజ్యోతి జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ చదివిన అంధ విద్యార్థి ఎం.ఢిల్లీశ్వరరావు ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విద్యార్థికి చిన్న తనం నుండి కళ్లు 90శాతం కనిపించడం లేదు. అయినా చదువుపై మక్కువతో తల్లిదండ్రులు రోజూ కళాశాలకు తీసువచ్చి చదివించేవారు. స్కైబ్ సాయంతో పరీక్షలు రాస్తూ పదోతరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచాడు. ఇంటర్‌లో 80శాతం మార్కులు సాధించి ప్రతిభా పురస్కారా నికి ఎంపికయ్యాడు. ప్రిన్సిపాల్ వి.ప్రవీణ్ ఢిల్లీ శ్వరరావును, తల్లిదండ్రులను అభినందించారు.
Updated Date - Jun 07 , 2025 | 12:33 AM