ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:32 PM

మహిళలు కుట్టు శిక్షణను సద్వినియోగం చేసు కోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

హిరమండలం: కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

హిరమండలం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): మహిళలు కుట్టు శిక్షణను సద్వినియోగం చేసు కోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీసీ కార్పొరేషన్‌ సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇటువంటి శిక్షణలను అందిస్తోందని, వీటిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ పి.బుచ్చిబాబు, ఎంపీడీవో కాళీప్రసాదరావు, ఎంఈవో కె.రాంబాబు, మండల ప్రత్యేక ఆహ్వా నితుడు తూలుగు తిరిపతిరావు, టీడీపీ నేతలు యాళ్ల నాగేశ్వరరావు, లాడే కృష్ణ, హెచ్‌ఎం టి.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
నీలమణి దుర్గమ్మ ఆలయ ఉత్సవాలు ప్రారంభం
పాతపట్నం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి):
ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం నీలమణిదుర్గ ఆలయ 50వ వార్షిక యాత్రా నవరాత్రి ఉత్సవాలు మంగళ వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సుధీష్ణ దంపతులకు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు, వేద మం త్రాల నడుమ స్వాగతం పలుకగా అమ్మవారికి వారు పట్టువస్త్రాలను సమ ర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, వర్థనీ కలశ స్థాపన విఘ్నేశ్వర పూజ, పంచ గవ్య ప్రాశన తదితర కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. తొలిరోజు అమ్మ వారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి
పాతపట్నం, ఏప్రిల్‌29(ఆంధ్రజ్యోతి):
పాతపట్నం నియోజకవర్గంలోని సమస్యలను పరిష్క రించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఈ మేరకు సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు నాయుడును ఉండవిల్లి లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. మెళియాపుట్టి లో ఐటీడీఏ, ఎల్‌ఎన్‌పేటలో పోలీస్‌ స్టేషన్‌, పాతపట్నంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో పాడైన ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

Updated Date - Apr 29 , 2025 | 11:32 PM