ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనుచిత పోస్టింగ్‌లపై చర్య తీసుకోండి

ABN, Publish Date - Jul 22 , 2025 | 11:28 PM

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పశువు కన్నా హీనమైన జంతువని, నిజాయతీగా పనిచేస్తున్న తనపై బురదచల్లుతున్నారని, తన భర్త వెంకన్నచౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష మండిపడ్డారు.జంటపట్టణాల్లోని లారీలకు వారివ్యక్తిగతంగా నెంబర్లువేసుకుంటే కలెక్షన్ల కోసమని వీటిని వేశారని ప్రచారంచేయడం తగదని పేర్కొన్నారు. ఈ విషయంపై లారీ యజమానులు స్పష్టంగా వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని, ఇది చాలదన్నట్లు వారి అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు ఫేస్‌బుక్‌లో పెడుతున్నారని మండిపడ్డారు.

డీఎస్పీ వెంకటఅప్పారావుకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పలాస, జూలై 22(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పశువు కన్నా హీనమైన జంతువని, నిజాయతీగా పనిచేస్తున్న తనపై బురదచల్లుతున్నారని, తన భర్త వెంకన్నచౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష మండిపడ్డారు.జంటపట్టణాల్లోని లారీలకు వారివ్యక్తిగతంగా నెంబర్లువేసుకుంటే కలెక్షన్ల కోసమని వీటిని వేశారని ప్రచారంచేయడం తగదని పేర్కొన్నారు. ఈ విషయంపై లారీ యజమానులు స్పష్టంగా వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని, ఇది చాలదన్నట్లు వారి అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు ఫేస్‌బుక్‌లో పెడుతున్నారని మండిపడ్డారు. ఇక నుంచి ఊరుకునేది లేదని,సోషల్‌మీడియాలో అనుచితపోస్టింగులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వి.వెంకటఅప్పారావుకు లిఖితపూర్వకంగా శిరీష ఫిర్యాదు చేశారు.రాజన్నటీమ్‌ పేరుతో ఐదేళ్లపాటు అబద్ధాలు, అసత్య ప్రచారంచేశారని, కూటమి ప్రభుత్వంలో కూడా ఆ విధానం కొనసాగిస్తామమంటే చర్యలుతప్పవని హెచ్చరించారు.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికిచర్యలు తీసుకోవాలి

అందరికి ఒప్పించి ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ట్రాఫిక్‌ ఆంక్షల నేపధ్యంలో వివిద వర్గాలతో డీఎస్పీ వి.వెంకటఅప్పారావు అభిప్రాయసేకరణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు,గాలి కృష్ణారావు, మల్లా శ్రీనివాసరావు, సప్ప నవీన్‌, వివిధ సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలు డీఎస్పీకి తెలియజేశారు.సమావేశంలో టీడీపీ నాయకులు బడ్డ నాగరాజు, ఎం.నరేంద్ర, తమ్మినేని గంగారామ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రామారావు, సీఐలు పి.సూర్యనారా యణ, తిరుపతిరావు, దువ్వాడ శ్రీకాంత్‌, మల్లా రామేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:28 PM