ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సారా ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచాలి

ABN, Publish Date - Jun 21 , 2025 | 12:01 AM

సారా ప్రభావిత గ్రామాలపై నిరంతర నిఘా ఉంచాలని, ఎక్కడ తయారు చేసినా తక్షణం కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామ చంద్ర రావు అన్నారు.

టెక్కలి: ఎక్సైజ్‌ సిబ్బందితో మాట్లాడుతున్న ఏసీ రామచంద్రరావు ( ఎక్సైజ్‌)

టెక్కలి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): సారా ప్రభావిత గ్రామాలపై నిరంతర నిఘా ఉంచాలని, ఎక్కడ తయారు చేసినా తక్షణం కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామ చంద్ర రావు అన్నారు. శుక్రవారం సారా ప్రభావిత గ్రామాల దత్తత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కలి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 35 వరకు ఇటువంటి గ్రామా లుండగా 18 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తయారు చేశామని, మిగిలిన 17 గ్రామాలను కూడా ఆ దిశగా తయారుచేయాలని సూచించారు. సారా విక్రయిం చినా, తయారు చేసి నా తగు చర్యలు తీసుకోవాలని ఆయా కేసుల్లో అరెస్టయిన వారిని బైండోవర్‌ చేయాలని, మరలా నేరానికి పాల్పడితే రూ.2 లక్షల వరకు అప రాధ రుసుం విధించాలని ఆదేశించారు. సారా తయారీకి అవసరమైన ముడిసరు కులు, బెల్లం సరఫరా చేసే వారిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పం పించాలన్నారు. అవసరమైతే రెవెన్యూ, పోలీస్‌, అటవీశాఖ అధికారులతో సమన్వ యం చేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి ఏఈఎస్‌ గోపాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

సారా తయారీదార్లకు బెల్లం అమ్మొద్దు

పలాస, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): సారా తయారీదార్లకు బెల్లం అమ్మవద్దని, ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పైడి రామచం ద్రరావు హెచ్చరించారు. శుక్రవారం కాశీబుగ్గ ఎక్సైజ్‌ కార్యాలయంలో పట్టణంలోని బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. నవోదయం 2.0లో భాగంగా జిల్లాను సారా రహితంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికి వ్యాపా రులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం.గోపా లకృష్ణ, సీఐ మల్లికార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:01 AM