మలేరియా లక్షణాలతో విద్యార్థిని మృతి
ABN, Publish Date - Jul 28 , 2025 | 11:46 PM
మండలంలోని కొనొకా గిరిజన గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని గాయత్రి దొండియా(13) మలేరియా జ్వర లక్షణాలతో బాధపడుతూ బరంపురం ఎంకేసీజీ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందింది.
కొనొకా గిరిజన గ్రామంలో విషాదఛాయలు
కంచిలి, జూలై 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొనొకా గిరిజన గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని గాయత్రి దొండియా(13) మలేరియా జ్వర లక్షణాలతో బాధపడుతూ బరంపురం ఎంకేసీజీ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందింది. స్థానికులు, బాలిక తల్లితండ్రులు తిలోత్తమ, బైలోడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గాయత్రికి విపరీతమైన జ్వరం రావడంతో ఈనెల 17న ఎంఎస్ పల్లి పీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి సోంపేట సామాజిక ఆసుపత్రికి రిఫర్ చేయగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. విద్యార్ధిని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై ఆసుపత్రి వైద్యురాలు సుస్మితా రెడ్డిని వివరణ కోరగా గాయత్రిని ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి జ్వర లక్షణాలు ఉన్నాయని, మెరుగైన వైద్యం కోసం సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
వైద్యులు, సిబ్బంది పనితీరుపై విమర్శలు
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితుల్లో ఎంఎస్ పల్లి ఆసుపత్రిలో వైద్యులు ఉండడం లేదని, సిబ్బంది తీరు సరిగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వైద్యాధికారి సక్రమంగా రావడం లేదని, సిబ్బంది సైతం అలాగే వ్యవహరిస్తున్నారన్న విమర్శలొ స్తున్నాయి. స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో సీజనల్ వ్యాధలు ప్రబలకుండాచర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
శ్రీకాకుళం రూరల్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పెద్దపాడు కేంద్రీయ విద్యాలయం సమీపంలో నివసిస్తున్న యవ్వారి అనూష (30) ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ కె.రాము తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కుటుంబంలో కుమార్తె మొదటి చీరకట్టే శుభకార్యం నిర్వహణపై భార్యభర్తలైన యవ్వారి రాజే ష్, అనూషల మధ్య వివాదం తలెత్తింది. తన అభిప్రాయానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని భావించి అనూష తీవ్ర మనస్తాపం చెంది ఆది వారం దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంట నే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jul 28 , 2025 | 11:46 PM