ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేర నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి

ABN, Publish Date - Jul 22 , 2025 | 11:44 PM

నేర నియంత్రణ కు పటిష్ఠ చర్యలు చేపట్టాలని, ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల్లో సంబంధిత నిర్వాహకులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

సమీక్షలో పాల్గొన్న పోలీసు అధికారులు, మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణ కు పటిష్ఠ చర్యలు చేపట్టాలని, ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల్లో సంబంధిత నిర్వాహకులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, నాన్‌ బెయిల్‌ బుల్‌ వారెంట్లు అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విజబుల్‌ పోలీసింగ్‌, కార్డన్‌ సెర్చ్‌ తదితర అంశాలపై డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. మహిళలు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించా లన్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్లు త్వరితగతిన అమలు పర్చాలన్నా రు. వాహనాలను తనిఖీ చేపట్టి గంజాయి రవాణా, క్రయ విక్రయాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:44 PM