ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమిటీలతో సంస్థాగతంగా బలోపేతం: ఎంపీ కలిశెట్టి

ABN, Publish Date - May 09 , 2025 | 11:37 PM

అన్ని నియోజకవర్గాల్లో గ్రామ, మండల స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి... టీడీపీని మరింత బలోపేతం చేయాలని విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు సూచించారు.

మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు :

ఎచ్చెర్ల, మే 9 (ఆంధ్రజ్యోతి): అన్ని నియోజకవర్గాల్లో గ్రామ, మండల స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి... టీడీపీని మరింత బలోపేతం చేయాలని విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు సూచించారు. చిలకపాలెంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలతో కమిటీలు ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్టాడుతూ ఈ కమిటీల ఏర్పాటులో ఎలాంటి జాప్యం చేయొద్దన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు, పథకాలను అర్హులకు చేరవేయడం, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కార్యకర్తలు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు ఆనెపు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, కుమరాపు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:37 PM