ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుకు చర్యలు

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:36 PM

నరసన్నపేట పట్టణంలో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

పాత బస్టాండ్‌లో స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఆర్డీవో సాయిప్రత్యూష

రసన్నపేట, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పాతబస్టాండ్‌లో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఆర్డీవో సాయిప్రత్యూషతో కలిసి గురువారం పరిశీలించారు. అంతకుముందు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రెవెన్యూ, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజుల చెరువు సుందీరకరణపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బైరి భాస్కరరావు, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో మధుసూదనరావు, మేజర్‌ పంచాయతీ ఈవో ద్రాక్షాయిణి, టీడీపీ నేతలు గొద్దు చిట్టిబాబు, జామి వెంకట్రావు, కింజరాపు రామారావు, సాసుపల్లి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.
దళితుల అభివృద్ధికి ప్రభుత్వం బాటలు
దళితుల అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఎస్సీ కులాల రిజర్వేషన్లకు క్యాబినెట్‌ ఆమోదించడంతో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. జనాభా దామాషా మేరకు ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్లు కల్పించి సమన్యాయం చేయడం జరిగిందన్నారు. త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ నోటిఫికేషన్‌తోనే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమానంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సారవకోట రామారావు, నేతలు యాగాటి లక్ష్మణరావు, ఉర్లాపు రాంబాబు, వెలుగు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:36 PM