సాగునీటి చెరువుల అభివృద్ధికి చర్యలు: శిరీష
ABN, Publish Date - May 08 , 2025 | 11:43 PM
రైతు సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టోందని, సాగు నీటి చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
వజ్రపుకొత్తూరు, మే 8(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టోందని, సాగు నీటి చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. గురువారం ఉపాధి హామీ నిధులు రూ.1.65 కోట్లతో 25 సాగునీటి పనులకు భూమిపూజ చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వంశధార నీరు శివారు భూములకు అందిం చామన్నారు. కార్యక్రమంలో వంశధార ఈఈ శేఖర్, ఎంపీడీవో ఎన్.రమేష్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు. నీటి సంఘం అధ్యక్షుడు గొనప నిరంజన్, దువ్వాడ అప్పారావు, దుంపల వల్లభరావు, శిష్టు పాపారావు పాల్గొన్నారు.
ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి
పలాస, మే 8 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడం ద్వారా కనీసం 500 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. గురువారం రామకృష్ణాపుర వద్ద రూ.7 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకు స్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామకృష్ణాపురం వద్ద 60.84 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 76 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు గాను 1000 చదరపు మీటర్ల చొప్పున స్థలాలను కేటాయించారన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ జయబాబు, వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మల్లా శ్రీనివాస రావు, మల్లా రామేశ్వరరావు, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీ కృష్ణ, ఆర్డీవో జి.వెంకటేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రాయి బాలకృష్ణయాదవ్, టీడీపీ నేతలు బడ్డ నాగరాజు, సప్ప నవీన్, దడియాల నర్సింహులు, పోలాకి పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 11:43 PM