Rain: సిక్కోలు జలమయం
ABN, Publish Date - May 21 , 2025 | 12:19 AM
Srikakulam Heavy Rainfall జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం ప్రజలను భయం గొల్పింది. అంతటా వారాల పండగలు జరుగుతుండగా.. వేకువజాము నుంచి భారీ వర్షం కురవడం.. కాసేపు తెరిపివ్వడం.. మళ్లీ కుండపోతగా వర్షం కురిసింది.
జిల్లా అంతటా కుండపోత వర్షం
శ్రీకాకుళం, మే 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం ప్రజలను భయం గొల్పింది. అంతటా వారాల పండగలు జరుగుతుండగా.. వేకువజాము నుంచి భారీ వర్షం కురవడం.. కాసేపు తెరిపివ్వడం.. మళ్లీ కుండపోతగా వర్షం కురిసింది. దీనికితోడు మేఘం గర్జించి.. పలుచోట్ల పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళన చెందారు. శ్రీకాకుళంలో భారీ వర్షం కురవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్, రైతుబజార్ జంక్షన్ నుంచి బగ్గు సరోజనీదేవి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు, డేఅండ్ నైట్ జంక్షన్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ ముందు రోడ్డు.. నగరంలో ఇరుకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్న గోడ వద్ద శ్రీకాకుళం నుంచి వెళ్తున్న కారు ఒకటి... కాలువలో సగం వరకు కూరుకుపోయింది. దీంతో గంటన్నర పాటుగా శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు ట్రాఫిక్ స్తంభించింది. పలాస, మందస, ఎచ్చెర్ల, రణస్థలంలో కుండపోతగానే వర్షం కురిసింది.
మంగళవారం జిల్లాలో నమోదైన వర్షపాతం(మిల్లీ మీటర్లలో) :
===================
శ్రీకాకుళం 58.25
పలాస 37.5
మందస 28.50
ఎచ్చెర్ల 29.25
రణస్థలం 18.8
పోలాకి 17.25
పొందూరు 13.0
ఆమదాలవలస 11.0
నందిగాం 10.5
పాతపట్నం 9.75
హిరమండలం 6.0
ఎల్.ఎన్.పేట 2.5
లావేరు 1.75
టెక్కలి 1.25
Updated Date - May 21 , 2025 | 12:19 AM