పోటీతత్వాన్ని పెంచేందుకు క్రీడలు దోహదం
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:38 PM
క్రీడాకారుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు క్రీడలు దోహ దం చేస్తాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూలై 12(ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు క్రీడలు దోహ దం చేస్తాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి బాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడ ల్లోనూ శ్రద్ధ వహించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటాను పెంచి క్రీడాకారులకు ఉన్నత స్థానంలో ఉంచిందన్నారు. రెండు రోజు ల పాటు జరగనున్న ఈ పోటీలకు సుమారు 400 మంది సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలో పాల్గొన్నారు. తొలిరోజు అండర్-11, 13, 15, 17, 19 బాలు రు, బాలికలతోపాటు మెన్, ఉమెన్ విభాగాల్లో కూడా పోటీలు నిర్వ హించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కె.సాగర్, ఆర్గ నైజింగ్ కార్యదర్శి నారాయణశెట్టి వెంకట కిరణ్ కుమార్, కార్యదర్శి ఎం.అశోక్ కుమార్, వూన్న కిరణ్‌కుమార్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎంవీరమణ, సీర రమణ, జి.భీమారావు, కె.రమణ, రత్నాజీ, సీఈవో సంపతి రావు సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా
పాత శ్రీకాకుళం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారులకు వివిధ రకాల పరికరాలను రాయితీపై అందించి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం మత్స్యశాఖ కార్యాలయంలో బందరువాని పేటకు చెందిన మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద 40శాతం, జిల్లా పరిపాలన ద్వారా ఆదనంగా మరో 10 శాతం సబ్సిడీ కల్పించి 52 మంది మత్స్యకారులకు రూ.67,85,100 విలువైన నెట్‌లు, ఇంజన్లు పంపిణీ చేశారు. మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వు చూడ డం నా జీవితంలో చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరె క్టర్ రమణయ్య, రూరల్ టీడీపీ ప్రతినిధులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 11:38 PM