ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ABN, Publish Date - May 06 , 2025 | 11:40 PM

జిల్లాలో వివిధ గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది. వార్షికోత్సవాలు, అమ్మవారి పండగల నేపథ్యంలో మంగళవారం ఆలయాలు, గ్రామాలు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, ముర్రాటల సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఎల్‌ఎన్‌పేట: ఘటాలతో ఆలయానికి ఊరేగింపుగా వెళుతున్న గ్రామస్థులు

జిల్లాలో వివిధ గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది. వార్షికోత్సవాలు, అమ్మవారి పండగల నేపథ్యంలో మంగళవారం ఆలయాలు, గ్రామాలు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, ముర్రాటల సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ వార్షికోత్సవం ప్రారంభం

నందిగాం, మే 6(ఆంధ్రజ్యోతి): పెంటూరులో వేంకటేశ్వరస్వామి ఆల య 23వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభ మయ్యాయు. ధర్మకర్తలు బొడ్డ జనార్దనరావు, కృష్ణారావు ఆధ్వర్యంలో శ్రీకూర్మం వేద పండితులు గోపినంబాళ్ల వెంకటదాస్‌ కూర్మాచార్యులు, ఆలయ అర్చ కులు రాజాగోపాలచార్యులు, ఇతర రుత్వికుల పర్యవేక్షణలో విశేష కార్య క్రమాలు చేశారు. సుప్రభాతసేవ, ఆరాధన, సాయంత్రం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, విశేష హోమాలు చేపట్టారు. బుధవారం గరుడ ప్రతిష్ఠ, ధ్వజారోహణ, గరుడసేవ ఊరేగింపు ఉంటాయని ధర్మకర్తలు తెలిపారు. దిమ్మిడిజోలలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ధ్యానమందిరం ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు మంగళ వారం ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన సలాన వెంక ట్రావు మాస్టారు, వాణిశ్రీ దంపతుల ఆధ్వర్యంలో పురోహితులు మదన్‌మోహన్‌ మిశ్రా, చంద్ర శేఖర్‌ శర్మ పర్యవేక్షణలో విశేష కార్యక్రమాలు చేపట్టారు. బాబా చిత్రపటాన్ని ఊరేగించారు.

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ముర్రాటలు

ఎల్‌.ఎన్‌.పేట, మే 6(ఆంధ్రజ్యోతి): దబ్బపాడు గ్రామంలోని గ్రామ దేవత సుమంతాపురం అమ్మ తల్లికి మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లిం చారు. మంగళవాయిద్యాలు, డప్పుల దరువులతో గ్రామస్థులంతా ఊరేగింపుగా వెళ్లి అమ్మ వారిని దర్శించుకున్నారు. పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరు కున్నారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో సుమం తాపురం గ్రామదేవతకు మొక్కులు చెల్లించు కోవడం ఆచారంగా వస్తోందని గ్రామ పెద్దలు జె.మోహనరావు, ఎం.లక్ష్మణరావు, పి.సంజీవు, పి. సీతారాం తదితరులు తెలిపారు.

ముగిసిన గ్రామదేవత పండగలు

పాతపట్నం, మే 6(ఆంధ్రజ్యోతి): తెంబూరు గ్రామంలో చింతల పోలమ్మ గ్రామదేవత పండగలు మంగళవారంతో ముగిశాయి. తొమ్మిదేళ ్లకోసారి జరిగే ఈ పండగల కోసం గ్రామానికి ప్రజలు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. బంధువులతో ఇళ్లన్నీ కళకళలాడాయి. మధ్యాహ్నం జాలారినాటకం, పగటి వేషధారణ, మేళతాళాల నడుమ అమ్మవారిని ఊరేగించారు. మహిళలు పెద్ద ఎత్తున కలశాలతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం నీలమణిదుర్గ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ వార్షిక యాత్రా మహోత్సవాల్లో భాగంగా శ్రీదేవి ఖడ్గనామాలతో కంకుమార్చనలు, వాస్తుహోమాలు నిర్వహించారు. సా యంత్రం శ్రీగోదాదేవి కోలాట బృందం కోలాట ప్రదర్శన ఆకట్టు కుంది. వేసవి సెలవులు కావడంతో దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

నీలమ్మతల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే శిరీష

వజ్రపుకొత్తూరు, మే 6(ఆంధ్రజ్యోతి): దేవునల్తాడ గ్రామంలో జరుగు తున్న శ్రీనీలమ్మతల్లి గ్రామదేవత ఉత్సవాల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష మంగ ళవారం పాల్గొన్నారు. అమ్మవారిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అందరూ ఐక్యంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, అగ్నికుల క్షత్రి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు, గోవిందు పాపారావు, కొల్లి రమేష్‌, వంక రామారావు ఉన్నారు.

పెద్దదూగాంలో అసిరితల్లికి ప్రత్యేక పూజలు

జలుమూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): పెద్దదూగాంలో కొలువు తీరిన అసిరితల్లి గ్రామదేవత ఆలయ 14వ వార్షికోత్సవం సందర్భంగా మంగళ వారం గ్రామస్థులు ముర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు. ఉత్సవమూర్తులకు పల్లకిలో వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారి సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటం ని ఆకట్టుకుంది. గొటివాడ గ్రామంలో కొలువుతీరిన వీర వెంకటసత్యనా రాయణ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి విగ్రహాన్ని పల్లకిలో వేంచేపుచేసి తిరువీధి నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:40 PM