ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కిడ్నీ ఆసుపత్రిలో స్పెషలిస్ట్‌ సేవలు అందించాలి

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:37 PM

పలాస కిడ్నీ ఆసు పత్రిలో స్పెషలిస్ట్‌ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ డిమాండ్‌ చేశారు.

సీటీ స్కానింగ్‌ మిషన్‌ను పరిశీలిస్తున్న అజశర్మ తదితరులు

పలాస, జూన్‌ 25 (ఆంధ్ర జ్యోతి): పలాస కిడ్నీ ఆసు పత్రిలో స్పెషలిస్ట్‌ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ డిమాండ్‌ చేశారు. బుధ వారం వేదిక సభ్యులతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ ఆసుపత్రి పూర్త యిన తరువాత పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోయారన్నారు. వైద్యసేవలు ప్రా రంభమైనా ఇంకా అనేక సేవలు అందు బాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. 60 మంది వైద్యులకు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారని, శాశ్వత నర్సులు పూర్తి గా లేరన్నారు. ఆసుపత్రి కాంట్రాక్టు పద్ధతిపై నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నెఫ్రోప్లస్‌ ప్రైవేట్‌ సంస్థ ద్వారా ఇక్కడ కిడ్నీ రోగులకు వైద్యం అందుతోందని, ప్రత్యేక నెఫ్రాలజిస్టులు లేర న్నారు. రోగులకు, వారి సహాయకులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించాలని, ప్రధాన రోడ్డు వద్ద రోగులను ఆసుపత్రికి తరలించేందుకు ఎలక్ట్రికల్‌ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రి రోడ్డులో బస్‌షెల్టర్‌ నిర్మించాలని కోరారు. సంస్థ ప్రతినిధులు టి.కామేశ్వర రావు, టి.అజయ్‌కుమార్‌, మోహనరావు, ఎన్‌.గణపతి, దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:37 PM