ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీవలసలో ప్రత్యేక వైద్య బృందం పర్యటన

ABN, Publish Date - Jul 26 , 2025 | 11:30 PM

టీడీ వలసలో గ్రామ స్థులకు జ్వరాలు, కీళ్ల నొప్పులు, వాపులు తదితర రోగాలు తగ్గకపో వడంతో శని వారం జిల్లా కేంద్రం నుంచి ఆర్‌ఆర్‌టీ ప్రత్యేక వైద్య బృందం పర్యటించి వ్యాధులపై ఆరా తీసింది.

రోగులతో మాట్లాడుతున్న ఆర్‌ఆర్‌టీ వైద్య బృందం ప్రతినిధులు

జి.సిగడాం, జూలై 26(ఆంధ్రజ్యోతి): టీడీ వలసలో గ్రామ స్థులకు జ్వరాలు, కీళ్ల నొప్పులు, వాపులు తదితర రోగాలు తగ్గకపో వడంతో శని వారం జిల్లా కేంద్రం నుంచి ఆర్‌ఆర్‌టీ ప్రత్యేక వైద్య బృందం పర్యటించి వ్యాధులపై ఆరా తీసింది. ఇంటింటికీ వెళ్లి రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటిని జిలాల కేంద్ర ఆసుపత్రిలో పరీక్షల నిమిత్తం తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ప్రత్యేక వైద్య బృంద సభ్యులు కమ్యూనిటీ మెడిసిన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మనోజ్‌, మైక్రో బయాలజీ బి.రాధిక, జనరల్‌ ఫిజీషియన్‌ పునిత్‌ రాహుల్‌, మెడిసిన్‌ విభాగం నుంచి రణధీర్‌రెడ్డి, జిల్లా మలేరియా నివారణ అధికారి సత్య నారాయణ రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరిస రాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వర్షాలు పడుతున్నం దున కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి పదార్థాలను తీసుకోవాలని సూచించారు. అవసరమైన రోగులకు మందులు అందజేశారు. రోగాలు తగ్గుముఖం పట్టేవరకు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహి స్తున్నట్లు పీహెచ్‌సీ వైద్యాధికారులు బి.యశ్వంత్‌, సుమబిందు తెలిపారు. దోమలు బెడద, పారిశుధ్య లోపం వల్ల రోగాలు ప్రబలినట్లు వైద్య బృంద ప్రతినిధులు తెలిపారు. వారి వెంట ఎంపీడీవో గుంట ముక్కల రామకృష్ణ తదితరులున్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:30 PM