వార్డుల్లోని ప్రధాన సమస్యలు పరిష్కరించండి
ABN, Publish Date - Jun 14 , 2025 | 12:04 AM
మునిసిపాలిటీ పరిధిలో గల పలు వార్డుల్లో పేరుకుపోయిన ప్రధాన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు అధికారులను కోరారు.
ఇచ్ఛాపురం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలో గల పలు వార్డుల్లో పేరుకుపోయిన ప్రధాన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు అధికారులను కోరారు. ఈమేరకు శుక్రవారం మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్.రమేష్ వినతి పత్రాన్ని అందజేశారు. 22వ వార్డు సత్యసాయి స్ట్రీట్ శాంతినికేతన్ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది. 15 ఏళ్ల కిందట వేసిన కొళాయిలు కావడంతో సక్రమంగా నీరు రావడం లేదని, అందువల్ల తక్షణమే పనులు చేపట్టాలని కోరారు. అలాగే 20వ వార్డు కొండపోలమ్మ కాలనీ ఏర్పాడి సుమారుగా 25 ఏళ్లు దాటింది. ఇంతవరకు ఈ కాలనీలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కాని స్ట్రీట్ లైట్లు కాని లేవు. దీంతో ప్రలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 10వ వార్డులో ప్రధాన వీధుల్లో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలి, మునిసిపాల్టీ పరిధిలో గల 23 వార్డుల్లో స్ట్రీట్ లైట్లు సరిగ్గా పనిచేయడం లేదు. వెంటనే లైట్లు బాగుచేయాలని కోరారు. శుక్రవారం నిర్వహించిన మునిసిపల్ షాపుల వేలం పాటల విషయంలో ప్రజలకు పూర్తిస్ధాయిలో సమాచారం లేదని, ప్రజలకు పూర్తిస్ధాయిలో సమాచారం అందజేసి మళ్లీ వేలం పాటలు నిర్వహించాలని కోరారు కార్యక్రమంలో జననేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పన దుర్యోధనరెడ్డి, రోకళ్ల వాసు, ప్రేమ్‌కుమార్, కలియా, శ్యామ్, రుక్మాంగధరావు తదితరులు పాల్గొన్నారు
Updated Date - Jun 14 , 2025 | 12:04 AM