రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్
ABN, Publish Date - Apr 10 , 2025 | 12:10 AM
: గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను వెంటనే పరి ష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యో తి): గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను వెంటనే పరి ష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ ఆదేశించారు. బుధవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో శ్రీకాకుళం డివిజన్‌కు చెందిన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీసర్వే, పీజీఆర్ ఎస్, పౌరసేవలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.గ్రామస్థాయిలో భూముల రీసర్వే ప్రక్రియను పటిష్టంగాఅమలు చేయాలని కోరారు.వాటర్‌ట్యాక్స్ వసూళ్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రజల అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకుని, సేవల నాణ్యతను మెరుగుపరచాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 12:10 AM