ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా మాలి కుల సమస్యకు పరిష్కారం

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:24 AM

జిల్లాలో ఉన్న మాలి కులస్థుల కుల ధ్రువీకరణ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కుల ధ్రువీకరణ కోసం అనేక పర్యా యాలు కుల సంఘ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించి వారికి కుల ధ్రువీ కరణ పత్రాలిచ్చేందుకు నిర్ణయించింది.

కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

50 మందికి కుల ధ్రువీకరణ పత్రాలు అందజేత

ఇచ్ఛాపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న మాలి కులస్థుల కుల ధ్రువీకరణ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కుల ధ్రువీకరణ కోసం అనేక పర్యా యాలు కుల సంఘ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించి వారికి కుల ధ్రువీ కరణ పత్రాలిచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు శుక్ర వారం పాయితారి, కీర్తీపురం, కొళిగాం పంచాయతీల్లో ఉన్న 50 మంది మాలి కులస్థులకు బీసీ-డి కుల ధ్రువీ కరణ పత్రాలను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ రామయ్యపుట్టుగలో అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాలి కుల స్థులకు అండగా ఉంటుం దన్నారు. వీరికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ కుల సంఘ నేతలు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పెదిని బాబ్జి, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, బోరిబద్ర లోహిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:24 AM