ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా తొలేళ్లు

ABN, Publish Date - May 20 , 2025 | 12:18 AM

సాలూరు గ్రామదేవత శ్యామలాంబ పండుగలో భాగంగా తొలేళ్ల ఉత్సవం సోమవారం పెదకోమటిపేట అమ్మవారి గద్దె వద్ద అత్యంత వైభవంగా జరిగింది.

ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామదేవత శ్యామలాంబ పండుగలో భాగంగా తొలేళ్ల ఉత్సవం సోమవారం పెదకోమటిపేట అమ్మవారి గద్దె వద్ద అత్యంత వైభవంగా జరిగింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పట్టణ యువరాజు విక్రమచంద్ర సన్యాసిరాజు (యువరాజు), ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో ఈ తంతు సాగింది. ముందుగా పట్టణంలోని యాదవవీధికి చెందిన కొందరు కర్రలను పైకెత్తి చప్పుడు చేస్తూ వీధుల్లో పర్యటించారు. వీరు అల్లువీధి, అక్కేనవీధి వాసుల వద్దకు వెళ్లి అమ్మవారి గద్దె వద్ద పూజలు చేశారు. ఆపై విత్తనాల బుట్టను శ్యామలాంబ ఆలయానికి తీసుకువెళ్లి చివరిగా పెదకోమటిపేట గద్దె వద్దకు చేరుకున్నారు. అనంతరం డబ్బివీధి, మెంటాడ వీధివాసులు కూడా కర్రలు పైకెత్తి చప్పుడు చేస్తూ గద్దె వద్దకు చేరుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మేళాలతో యువరాజు ఇంటికి వెళ్లి ఉత్సవానికి ఆహ్వానించారు. మేళతాళాలతో ఆయనను తొలేళ్ల ఉత్సవానికి తీసుకువచ్చారు. అనంతరం విత్తనాల బుట్టకు పూజలు చేశారు. ముందుగా నిర్ణయించిన విధంగా అక్కేనవీధివాసులు పూజను పలుపుతాళ్లతో కట్టి అమ్మవారి గద్దె వద్ద ప్రదక్షిణ చేశారు. అనంతరం అల్లువీధి, యాదవవీధి, డబ్బివీధి, మెంటాడ వీధివాసులు ఒకరి తరువాత ఒకరు పూజలో పాల్గొన్నారు. డీఎస్పీ రాంబాబు, సీఐ రామకృష్ణలు బందోబస్తును పర్యవేక్షించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తజనాన్ని నియంత్రించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తొలేళ్ల ఉత్సవం పూర్తయిన వెంటనే అమ్మవారి పూజను ఆలయ అనువంశిక ధర్మకర్త విక్రమచంద్ర సన్యాసిరాజు (యువరాజు)కు మంత్రి సమక్షంలో ఉత్సవ కమిటీ అందజేసింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అక్కేన అప్పారావు, నిమ్మాది తిరుపతిరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌పీ.భంజ్‌దేవ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు సిరిమానోత్సవం..

అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం జరగనుంది. సాయంత్ర ం నాయుడు వీధిలో ప్రారంభమయ్యే సిరిమానోత్సవం శివాజీ బొమ్మ, బోసుబొమ్మ, మెయిన్‌రోడ్డు మీదుగా డీలక్స్‌ సెంటర్‌కు చేరు కుంటుంది. అక్కడి నుంచి కోట జంక్షన్‌ మీదుగా పెదకోమటిపేట, డబ్బివీధి, దండిగాం రోడ్డు చేరు కుంటుంది. తిరిగి బోసుబొమ్మ నుంచి శివాజీ బొమ్మ, శివాజీ బొమ్మ నుంచి అక్కేన వీధి రామమందిరం, అక్కడి నుంచి తోటవీధిలో ఉన్న శ్యామలాంబ అమ్మవారి ఆలయానికి సిరిమాను చేరుకోనుంది.

Updated Date - May 20 , 2025 | 12:18 AM