ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసు లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు

ABN, Publish Date - May 21 , 2025 | 11:59 PM

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పెంటూరు గ్రామానికి చెందిన జవాన్‌ పిన్నింటి దొరబాబు అంత్యక్రియలు బుధవారం పోలీసు లాంఛనాలతో నిర్వహించారు.

మృతదేహం వద్ద గౌరవ సూచకంగా గాలిలో కాల్పులు జరుపుతున్న పోలీసులు

నందిగాం, మే 21(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పెంటూరు గ్రామానికి చెందిన జవాన్‌ పిన్నింటి దొరబాబు అంత్యక్రియలు బుధవారం పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. నరసన్నపేట మండ లం సత్యవరం జంక్షన్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దొరబాబు మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్మీ, ఏఆర్‌, ఎన్‌సీసీ, సివిల్‌ పోలీసులు పెంటూరు శ్మశాన వాటిక వద్ద గౌరవ వంద నం చేశారు. మృతదేహంపై జాతీయ జెండాను కప్పి మూడు పర్యాయా లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం తండ్రి సదానందం కుమా రుడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. జాతీయ జెండాను మృతుడి భార్య కాంచనకు పోలీసులు అప్పగించారు. దొరబాబు మృతితో కుటుంబ సభ్యులతో పాటు గ్రామ స్థుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి పిల్లలు చిన్నవారు కావడంతో వారి బేలచూపులు చూపరులను కన్నీరు పెట్టించాయి.

Updated Date - May 21 , 2025 | 11:59 PM