ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సైనికుల లాంఛనాలతో జవాన్‌ అంత్యక్రియలు

ABN, Publish Date - May 18 , 2025 | 11:53 PM

మునిసిపాలిటీలోని ఆరో వార్డులో గల టి.మన్నయ్యపేటకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గొద్దు మోహన్‌రావు (46) అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు.

మృతదేహంపై జాతీయజెండాను కప్పుతున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు:

ఆమదాలవలస, మే18 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని ఆరో వార్డులో గల టి.మన్నయ్యపేటకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గొద్దు మోహన్‌రావు (46) అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తుండగా శుక్రవారం మోహన్‌రావు గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం విదితమే. శనివారం ఉదయం ఢిల్లీలోని ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద అధికారులు మోహన్‌రావు భౌతి కకాయానికి నివాళులర్పించారు. ఆదివారం వేకువజామున ఐదుగంటలకు ఢిల్లీ నుంచి విమానంలో విశాఖవిమానాశ్రయానికి భౌతికకాయం చేరుకుం ది. ఇక్కడ సంబంధిత బీఎస్‌ఎఫ్‌ అధికారులు కూడా నివాళులర్పించారు. అనంతరం బీఎస్‌ఎఫ్‌ వాహనంలో భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలిం చారు. శ్రీకాకుళం సమీపంలోని కొత్తరోడ్డు నుంచి మన్నయ్యపేట వరకు యువకులు జాతీయ జెండాలను పట్టుకొనిర్యాలీ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఇంటికి చేరుకున్న మోహన్‌రావు పార్థివదేహాన్ని చూసి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు విలపించారు. అనంతరం భారీగా ర్యాలీగా గ్రామంలోని శ్మశానవాటికకు తరలించారు. అక్కడ బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మోహన్‌రావు మృతదేహం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. మూడురౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి వందనం సమర్పించారు.అంత్యక్రియల్లో ఆరు, ఏడోవార్డుల యువకులు, టి.మనయ్యపేట ఫ్రెండ్స్‌యూత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:53 PM