ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ మంత్రి ప్రోత్సాహంతోనే సోషల్‌ మీడియా దాడి

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:13 AM

తన కుటుంబం, తనపై వ్యక్తిగతం గా మాజీ మంత్రి సీదిరి అప్పలరా జు పోత్సాహంతో ఆయన అనుచర గణం సోషల్‌ మీడియా వేదికగా దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించారు.

క్లిప్పింగులు చూపిస్తున్న ఎమ్మెల్యే శిరీష
  • పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): తన కుటుంబం, తనపై వ్యక్తిగతం గా మాజీ మంత్రి సీదిరి అప్పలరా జు పోత్సాహంతో ఆయన అనుచర గణం సోషల్‌ మీడియా వేదికగా దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించారు. ఆదివారం ఆమె స్థానిక టీడీపీ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు. అప్పుడు అ ధికారంలో ఉన్నా.. ఇప్పుడు ప్రతిప క్షంలో ఉన్నా వారి వికృత చేష్టలు ఆపడం లేదని, వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. మహిళలపై సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఈ విషయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలాస మండలం సున్నాదేవి గ్రామానికి చెందిన దివ్యాం గుడు దున్న బాలకృష్ణ తనపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తు న్నారని వాటి క్లిప్పింగులు ప్రదర్శించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తాను తప్పుడు విమర్శల కు భయపడేది లేదని, వ్యక్తిగతంగా తన భర్త, కుటుంబాన్ని సోషల్‌ మీడియా వేదికగా పోస్టింగులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి విమర్శలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మంచినీళ్లపేటలో ఆదివారం సాయంత్రం మాజీమంత్రి అప్పలరాజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకొని నిలదీశాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగగా ఎస్‌ఐ బి.నిహార్‌ చేరుకొని వివాదానికి తెరదించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి అప్పలరాజు వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించగానికి మంచినీళ్లపేట గ్రామానికి వచ్చారు. అనంతరం గ్రామంలో వైసీపీ శ్రేణులు నిర్వహిస్తున్న బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని సూపర్‌సిక్స్‌ పఽథకాలపై మైక్‌లో విమర్శించారు. దీంతో స్థానిక మాజీ సర్పంచ్‌ గుల్ల చిన్నయ్య, ఆకుల పాపారావులతో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని గ్రామంలో ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పాలని మాజీ మంత్రిని నీలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని ఆదుపుచేశారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేయడంతో వివాదం సద్ధుమనిగింది.

Updated Date - Aug 04 , 2025 | 12:13 AM